మిస్ యూ పప్పా..! తండ్రిని గుర్తు చేసుకుని ఉద్వేగానికిలోనైన తేజ్ ప్రతాప్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచారంలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తండ్రిని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. బీహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి మహాకూమిగా ఏర్పడి పోటీస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురవారం రాహుల్ గాంధీ తమ అభ్యర్థి శతృఘ్ను సిన్హాతో కలిసి పాటలీపుత్రలో ప్రచారం నిర్వహించారు. ఈ సభకు ఆర్జేడీ తరఫున తేజస్వీ, తేజ్ ప్రతాప్‌లు హాజరయ్యారు.
పాటలీపుత్ర సభలో లాలూ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన.. తండ్రిని గుర్తు చేసుకున్నారు. లాలూ తన వెంట లేనందునే మాట్లాడే అవకాశం దొరకలేదని ఉద్వేగానికి లోనయ్యారు. మిస్ యూ పప్పా అంటూ కన్నీళ్లు కారుస్తున్న ఎమోజీలను జతచేసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

తేజస్వీ ట్వీట్ వైరల్‌గా మారడంతో మీడియా ఈ విషయాన్ని తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వీని ప్రశ్నించారు. అయితే ఈ విషయం తనకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు. బహుశా సమయం లేకపోవడం వల్ల తన అన్నకు మాట్లాడే అవకాశం వచ్చి ఉండకపోవచ్చని అన్నారు.
లాలూ కుమారులైన తేజ్ ప్రతాప్, తేజస్విల మధ్య విబేధాలు వచ్చాయని గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవలే తేజ్ ప్రతాప్ ఆర్జేడీ స్టూడెంట్ వింగ్ నుంచి వైదొలగడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ మధ్యకాలంలో తేజ్ ప్రతాప్ లాలూ - రబ్రీ మోర్చా పేరుతో సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఎన్నికల ప్రచారంలో అన్నదమ్ములిద్దరూ పాల్గొనడంతో వారి మధ్య విబేధాలు సమసిపోయాయని అంతా అనుకున్నారు. అయితే తాజాగా తేజ్ ప్రతాప్ చేసిన ట్వీట్ ఆయన తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని మరోసారి బహిర్గతం చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications