నామినేటెడ్ సీఎం నితీశ్.. కంగ్రాట్స్... మరీ ఇచ్చిన హామీలను మరవొద్దని తేజస్వీ సెటైర్స్..

బీహర్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు అందరూ విష్ చేస్తున్నారు. అయితే సెటైర్లు వేసేవారు ఎక్కువ అవుతున్నారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించగా.. ఇప్పుడు ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ వంతు వచ్చింది. తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ నితీశ్ కుమార్‌ను విష్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

సీఎంగా నామినేట్ అయిన నితీశ్ కుమార్ కు శుభాకాంక్షలు అని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. అధికార ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి బదులు అంటూ స్టార్ట్ చేశారు. నితీశ్ కుమార్ వరసగా నాలుగోసారి సీఎంగా.. మొత్తంగా ఏడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

tejashwi yadav calls nitish kumar as nominated bihar cm

ఎన్నికల సమయంలో ఎన్డీయే ఇచ్చిన హామీ 19 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఆశిస్తున్నా అని తెలిపారు. నీటి పారుదల సమస్యలు, విద్య వంటి సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలలో ఎక్కువ స్థానాలను ఆర్జేడీ సాధించగా.. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. జేడీయూ మూడో స్థానానికి పరిమితమైన.. పొత్తులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు నితీశ్ కుమార్‌ను సీఎం చేశారు.

40 సీట్లు వచ్చిన వ్యక్తిని సీఎం పీఠంపై ఎలా కూర్చోబెడతారని మహాకూటమిలోని పార్టీలు ప్రశ్నించాయి. ప్రజలు తిరస్కరించిన నితీశ్ కుమార్‌ను మళ్లీ సీఎం ఎలా చేస్తారని ఎద్దేవా చేశాయి. కానీ సంకీర్ణ ధర్మం పాటిస్తూ.. బీజేపీ నితీశ్ కుమార్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+