వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్ధవ్‌ ఠాక్రేతో సీఎం కేసీఆర్‌ కీలక భేటీ.. మోదీ సర్కార్‌ను గద్దె దించడమే ఎజెండాగా.. !!

|
Google Oneindia TeluguNews

దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో నిమగ్నమైయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో ముంబైలో సీఎం కేసీఆర్ సమావేశమైయ్యారు.

దేశ రాజకీయాలే ప్రధాన అంశంగా ...


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ ఎజెండా అని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. భావసారూర్యం కలిసిన పార్టీలను ఏకం చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో లంచ్ మీటింగ్‌లో కేసీఆర్ పాల్గొన్నారు. దేశ రాజకీయాలే ప్రధాన అంశంగా వీరు చ‌ర్చించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్‌ కుమార్‌, కేకే,రంజిత్‌ కుమార్‌, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శ్రవణ్‌ కుమార్‌, 'సినీ నటుడు ప్రకాశ్ రాజ్, పలువురు టీఆర్ఎస్ ప్రముఖ్య నేత‌లు ఉన్నారు.

కేసీఆర్‌కు ఉద్ద‌వ్ ఠాక్రే ఆతిథ్యం..

ఢిల్లీ కోటను బద్దలు కొడతామంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే పలు పార్టీలు మద్దతు తెలిపాయి. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నట్లు బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలు స్వయంగా ఫోన్ చేసి చెప్పాయి. ఇదే క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి , శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే .. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జాతీయ స్థాయిలో పోరాటానికి తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ముంబై రావాలని, తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు

Recommended Video

KCR Uddhav Thackeray Meet కేంద్రంపై యుద్ధం Deve Gowda మద్దతు| Third Front | Oneindia Telugu

భావసారూప్యం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలి..

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై పర్యటనకు వెళ్లారు. ఉద్దవ్‌తో భేటీ అయ్యారు. దేశంలో ప్రజాకంటక పాలన కొనసాగుతుందని ఈసందర్భంగా చర్చించుకున్నారు. బీజేపీని గద్దేదించాలంటే భావసారూప్యం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్దవ్ ఠాక్రేతో భేటీ ముగిసిన అనంతరం ఎన్సీపీ అధినేత , మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ తో సమావేశం కానున్నారు. దేశంలో నెల‌కొన్న తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై చర్చించనున్నారు.

English summary
cm kcr meeting with maharashtra cm uddhav thackeray in Mumbai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X