టీ నివేదిక, డ్రాఫ్ట్ బిల్లు రెడీ: రేపే క్యాబినెట్ ముందుకు
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు, ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు కేంద్ర మంత్రి, కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. అవి రేపు గురువారంనాడే మంత్రి వర్గం ముందుకు వస్తాయని ఆయన బుధవారంనాడు చెప్పారు. గురువారం రాత్రి 8 గంటలకు జివోఎం సమావేశం కానున్న నేపథ్యంలో జైరాం రమేష్ ఆ విషయం చెప్పారు.
తెలంగాణ నివేదికను 25 పేజీలతో, ముసాయిదా బిల్లును 70 పేజీలతో రూపొందించినట్లు సమాచారం. ఆరు పేజీలతో క్యాబినెట్ నోట్ కూడా సిద్ధమైంది. రాయల తెలంగాణపై ఇంకా స్పష్టత రాలేదని జైరాం రమేష్ అన్నారు. బుధవారం రాత్రి జరిగేదే జివోఎం తుది సమావేశమని భావిస్తున్నారు. నిజానికి మంగళవారంనాడే తుది సమావేశం జరగాల్సి ఉంది. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం కూడా జీవోఎం సమావేశమవుతోంది.

కాగా, పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందో రాదో చెప్పలేమని జివోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ బుధవారంనాడు కోల్‌కతాలో అన్నారు. తెలంగాణ బిల్లును సాధ్యమైనంత త్వరగా పార్లమెంటులో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అయితే, ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు సభకు వస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.
వీలైనం త్వరగా పార్లమెంటుకు తెలంగాణ బిల్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శీతాకాల సమావేశాల్లో వస్తుందని అప్పుడే చెప్పలేమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై జివోఎం వేగంగా పని చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications