Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: వచ్చే ఏడాది టెలికం రంగంలో 30 లక్షల ఉద్యోగాలు

వచ్చే ఏడాది టెలికం రంగంలో 30 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. 4జీ టెక్నాలజీ , డేటా వాడకం పెరగడంతో 30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

న్యూఢిల్లీ:వచ్చే ఏడాది టెలికం రంగంలో 30 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. 4జీ టెక్నాలజీ , డేటా వాడకం పెరగడంతో 30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

కొత్త ఆపరేటర్లు మార్కెట్లోకి ఎంట్రీ డిజిటల్ వాలెట్ల ప్రవేశం , స్మార్ట్‌ఫోన్‌కు డిమాండ్ పెరగడం, టెక్నాలజీకి మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడడంతో టెలికం రంగంలో కొత కొత్త ఉద్యోగావకాశాలకు అవకాశమేర్పడింది.

 Telecommunications sector to generate 30 lakh jobs by 2018: Study

ఎమర్జింగ్ టెక్నాలజీలు, 5 జీ, ఎం2ఎం ఇన్మర్మేషన్ , కమ్యూనికేషన్స్ టెక్నాలజీల్లో పరిణమాలు కూడ ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయని అసోచామ్ కెవీపీఎం సంయుక్త అధ్యయనం తెలిపింది.

2021 నాటికి వీటిలో కూడ 8 లక్షల 70వేల ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆ ఆధ్యయనం తెలిపింది. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు సంఖ్య పరంగా అప్‌కమింగ్ డిమాండ్ తన నాణ్యతపరంగా సరిపోరని ఈ అధ్యయనం వెల్లడించింది.

నైపున్యాల పరంగా ఉన్న లోటును పూరించడానికి ఇన్‌ఫ్రా సైబర్ సెక్రటరీ నిపుణులు అప్లికేషన్ డెవలపర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరర్స్ టెక్నీషీయన్స్ , హ్యాండ్‌సెట్ టెక్నీషీయన్స్ వంటి విభాగాల్లో నైపున్యాలున్న ఉద్యోగులను గుర్తించనున్నారు.

ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల స్కిల్స్ సరిపోవని ఆ నివేదిక వెల్లడించింది. టెలికం వృద్ది రేటులో 19.6 శాతాన్ని నమోదు చేసింది. రెవిన్యూ పరంగా గత కొన్నేళ్ళుగా ఈ వృద్ది 7.07 శాతంగా ఉంది. టెలికం సర్వీసు ఫ్రోవైడర్లు కూడ తమ నెట్‌వర్క్‌లలో కొనసాగింపుగా పెట్టుబడులను పెడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+