Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జియోకు షాక్: రూ.103 లకే ఉచిత కాల్స్, 4జీ డేటాను ప్రకటించిన టెలినార్

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఇదే తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా టెలినార్ కూడ రూ.103 లకే అపరిమిత కాల్స్, 4జీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఇదే తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా టెలినార్ కూడ రూ.103 లకే అపరిమిత కాల్స్, 4జీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపుతోంది. ఆరు మాసాల పాటు ఉచిత సేవలను అందించిన జియో ఏప్రిల్ మాసం నుండి కస్టమర్ల నుండి ఛార్జీలను వసూలు చేస్తోంది.

అయితే రిలయన్స్ జియో ఉచిత సేవలకు ట్రాయ్ నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.కాని, సమ్మర్ స్పెషల్ ఆఫర్లకు మాత్రం ట్రాయ్ అభ్యంతరం తెలిపింది. దీంతో ధనాధన్ ఆఫర్ ను జియో ప్రకటించింది.

అయితే టెలినార్ జియోకు షాకిచ్చే ఆఫర్ ను ప్రకటించింది.రూ.103 లకే ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు, 4జీ డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

జియోకు షాకిచ్చే ఆఫర్ ను ప్రకటించిన టెలినార్

జియోకు షాకిచ్చే ఆఫర్ ను ప్రకటించిన టెలినార్

టెలినార్ కంపెనీ జియోకు షాకిచ్చింది. జియో ఇస్తున్న ఆఫర్ కంటే మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం రూ.103 లకే ఉచిత అపరిమిత వాయిస్ కాల్స్ ను ప్రకటించింది. మరో వైపు 4జీ డేటా ను కూడ ఇవ్వనున్నట్టు ప్రకటించింది టెలినార్.టెలినార్ నెంబర్ పై రూ.110 లతో రీచార్జీ చేసుకొని ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని టెలినార్ ప్రకటించింది.

60 రోజుల పాటు వ్యాలిడిటీ

60 రోజుల పాటు వ్యాలిడిటీ

టెలినార్ తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ 60 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఉచితంగా వాయిస్ కాల్స్ ను 90 రోజుల పాటు చేసుకొనే వెసులుబాటును కల్పించింది.అయితే డేటా మాత్రం 60 రోజులకు మాత్రమే పరిమితం కానుంది.అయితే టెలినార్ ఇచ్చిన ఆఫర్ .

కొత్త కస్టమర్లకు కూడ వర్తింపు

కొత్త కస్టమర్లకు కూడ వర్తింపు

ఇప్పటికే టెలినార్ కస్టమర్లు రూ.103 తో రీచార్జీ చేసుకొంటే ఈ పథకం వర్తిస్తోంది.అయితే కొత్తగా టెలినార్ కస్టమర్లుగా మారితే వారికి కూడ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. కొత్తవారు రూ.103 లతో రీ చార్జీ చేసుకోవాలి. అయితే వారికి రూ.25 వరకు ఉచితంగా కాల్స్ ను ఇవ్వనున్నారు.ఈ బ్యాలెన్స్ అయినపోయిన తర్వాత ప్రతి కాల్ కు 25 పైసల చొప్పున వసూలు చేస్తారు.

2జీబీ దాటితే 128 కెబిపిఎస్ డేటా

2జీబీ దాటితే 128 కెబిపిఎస్ డేటా

2జీబీ డేటా లిమిట్ పూర్తైతే 128 కెబిపీఎస్ స్పీడ్ కు డేటా పడిపోతోంది. అయితే కొత్తగా టెలినార్ లో కస్టమర్లుగా చేరిన వారు కూడ ప్రతిరోజు కూడ 2 జీబీ డేటాను పొందే అవకాశం ఉంది. టెలినార్ 4జీ సర్వీసులను ఆఫర్ చేసే అన్ని సర్కిళ్ళలో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.అయితే ఈ కొత్త ఆఫర్ జియోకు షాకిచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+