Gold Smuggling Case: రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో తెలుగు నటుడు!

Gold Smuggling Case: బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన పెద్ద నెట్‌వర్క్ ను బట్టబయలు చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) ఇటీవల కన్నడ నటి రన్యా రావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో రన్యా రావు స్నేహితుడు నటుడు తరుణ్ రాజ్ అలియాస్ విరాట్ కొండూరు రాజ్ పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది. డీఆర్ఐ అధికారులు తరుణ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. మూడు తెలుగు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన తరుణ్ కూడా ఈ స్మగ్లింగ్ ముఠాతో సంబంధం కలిగి ఉన్నాడని అనుమానుస్తున్నారు. అదే సమయంలో తరుణ్ బెయిల్ పిటిషన్ పై నేడు దిగువ కోర్టులో విచారణ జరగనుంది.

అనేక కోణాల్లో విచారణ
దక్షిణ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రసిద్ధ నటి రన్యా రావు అంతర్జాతీయ బంగారు స్మగ్లింగ్ నెట్‌వర్క్ లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సన్నిహితుడు, టాలీవుడ్ నటుడు తరుణ్ రాజ్ హస్తం కూడా ఉండొచ్చని దర్యాప్తు లో తేలింది. ఈ రాకెట్ లో సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు కూడా ఉన్నారా అనే కోణం నుంచి డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Telugu Actor Tarun Konduru Raj Under Investigation in Ranya Rao s Gold Smuggling Case

తెలుగు చిత్రంతో పరిచయం
నటుడు తరుణ్ రాజ్ తన కెరీర్ ను 2018 తెలుగు చిత్రం 'పరిచయం'తో ప్రారంభించాడు. ఈ సినిమాలో అతను ప్రధాన పాత్రలో కనిపించాడు. సినిమా పరిశ్రమలోకి రాక ముందు తన పేరును విరాట్ కొండూరు రాజ్ గా మార్చుకున్నాడు. అతన రన్యారావుకు చాలా సన్నిహితుడని.. వారిద్దరి మధ్య చాలా కాలంగా స్నేహం ఉందని తెలిసింది. తరుణ్, రన్యా వారి సినీ జీవితంలో స్నేహితులు అయ్యారు. ఈ స్మగ్లింగ్ రాకెట్ లో తరుణ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు. అందుకే తరుణ్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

తరుణ్ రాజ్ పాత్ర ఉందా?
నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ నెట్ వర్క్ లో తరుణ్ రాజ్ పాత్ర ఉండవచ్చని డీఆర్ఐ అనుమానిస్తోంది. ఈ రాకెట్ లో సినీపరిశ్రమతో సంబంధం ఉన్న మరింత మంది వ్యక్తులు ఇందులో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మూలాలను తెలుసుకోవడానికి డీఆర్ఐ బృందం తరుణ్ ను క్షుణ్ణంగా విచారిస్తోంది. నటుడు తరుణ్ రాజ్ ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్నాడు.ఇదిలా ఉండగా.. అతని బెయిల్ పిటిషన్ నేడు దిగువ కోర్టులో విచారణకు రానుంది. ఈ విచారణ అనంతరం తరుణ్ ను విడుదల చేస్తారా లేదా ప్రశ్నించడంకోసం కస్టడీలో ఉంచుతారా అనేది నిర్ణయించబడుతుంది. ఈ మొత్తం కేసులో ఇతర సినీ ప్రముఖులతో ఉన్న సంబంధాలను డీఆర్ఐ దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ హై-ప్రొఫైల్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+