వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమ్మపై పథకం ప్రకారం.. శశికళ నిజస్వరూపం బయటపడింది'

దివంగత జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉందని తమిళనాడు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. జయ మృతి చెంది నెల రోజులు కాకముందే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపట్టడం చూస్తే ఆ

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉందని తమిళనాడు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. జయ మృతి చెంది నెల రోజులు కాకముందే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపట్టడం చూస్తే ఆమె నిజ స్వరూపం బయటపడిందన్నారు.

దటీజ్ చిన్నమ్మ: ఉచ్చు బిగిద్దామనుకుంటే.. శశికళ ముందు బీజేపీ, పన్నీరు చిత్తుదటీజ్ చిన్నమ్మ: ఉచ్చు బిగిద్దామనుకుంటే.. శశికళ ముందు బీజేపీ, పన్నీరు చిత్తు

ఒక పథకం ప్రకారం అమ్మ మతికి కారణమయ్యారని ఆరోపించారు. జయ మృతి పైన సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి పోస్టు కార్డుల ద్వారా లేఖలు పంపిస్తామన్నారు.

ఉప ఎన్నికల్లో గెలిపించుకోగలరా

ఉప ఎన్నికల్లో గెలిపించుకోగలరా

ఎందరో మహానుభావులు స్థాపించిన అన్నాడీఎంకే పార్టీకి శశికళ ప్రధాన కార్యదర్శి కావడంతమిళ ప్రజలకు అంతుపట్టడం లేదన్నారు. శశికళకు ధైర్యం ఉంటే ఐదుగురు శాసన సభ్యులతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించగలరా, అలా గెలిపించినప్పుడే ఆమెను అమ్మ వారసురాలిగా గుర్తిస్తారన్నారు.

బ్లాక్ మెయిలింగ్ ద్వారా పదవి సరికాదు

బ్లాక్ మెయిలింగ్ ద్వారా పదవి సరికాదు

డొంక తిరుగుడు, బ్లాక్ మెయిలింగ్ విధానాల ద్వారా పార్టీ పగ్గాలు చేపట్టడం సరికాదన్నారు. 75 రోజులుగా ఆసుపత్రిలో జరిగిన సంఘటనలు.. అమ్మ మతి పైన పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

అప్పుడు ఫోటో ఎందుకు విడుదల చేయలేదు

అప్పుడు ఫోటో ఎందుకు విడుదల చేయలేదు

జయలలిత ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నప్పుడు ఆమె ఫోటో విడుదల చేయకపోవడం తప్పు కాదు కానీ, ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పినప్పుడైనా ఎందుకు ఫోటో విడుదల చేయలేదని ప్రశ్నించారు.

వీటి పైనా విచారణ చేయాలి

వీటి పైనా విచారణ చేయాలి

ముఖ్యమంత్రి హోదాలో ఆసుపత్రిలో తీసుకున్న నిర్ణయాలు, అదే విధంగా ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు జయలలిత వేలిముద్రతో ఇచ్చిన ధ్రువపత్రాలు అన్నింటి మీద విచారణ జరపాలన్నారు. 2011లో జయపై కుట్ర జరిగిందన్నారు. అమ్మ మతి పైన అనుమానాలు నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణ జరిపించాలని ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు వేసినట్లు చెప్పారు.

కాళ్లు తొలగించారా?

కాళ్లు తొలగించారా?

కాగా, అమ్మ ఆసుపత్రిలో చేరిన దగ్గరి నుంచి ఆమె మృతి వరకు అంతా మిస్టరీగానే మిగిలింది. అయితే ఎవరూ గుర్తించని, అంతగా పట్టించుకోని విషయం ఒకటి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. అదే అమ్మకాళ్ల తొలగింపు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సమయంలో ఆమె ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు రెండు కాళ్లను తొలగించారంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది.

English summary
Telugu Association Demands CBI Inquiry Into Jayalalithaa's Death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X