టిక్‌టాక్ వీడియో వైరల్: "పడిపోయా పడిపోయా" అంటూ ఈ అమ్మాయి ఎక్కడి నుంచి పడిందో తెలుసా..?

Recommended Video

    టిక్‌టాక్ వీడియో వైరల్: 'పడిపోయా పడిపోయా' అంటూ ఈ అమ్మాయి ఎక్కడి నుంచి పడిందో తెలుసా..?

    ఇప్పుడు ప్రపంచాన్ని సోషల్ మీడియా కుదిపేస్తోంది. ఏ మూలన ఏ చిన్న ఘటన జరిగిన ప్రసార మాధ్యమాలకంటే వేగంగా సోషల్ మీడియా ద్వారా వార్త తెలిసిపోతోంది. ఇక సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని సోషల్ మీడియా ద్వారా ఒక్కరాత్రిలోనే సెన్సేషనల్ స్టార్స్ అయిన వారున్నారు... అదే రాత్రిలోనే అప్పటివరకు సంపాదించుకున్న పేరుప్రఖ్యాతలు గంగలో కలిసిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి సోషల్ మీడియా యాప్‌లో సెన్సేషనల్‌గా మారింది టిక్ టాక్ యాప్.

    ఓవర్ నైట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యాప్

    ఓవర్ నైట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యాప్

    టిక్‌ టాక్ యాప్... ఇది ఓవర్‌నైట్‌‌లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో ఎవరైనా సరే లాగిన్ అయి తమ సొంత వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు టిక్‌టాక్‌లో తమ టాలెంట్‌ను చూపి సినిమా అవకాశాలు పొందిన వారుకూడా ఉన్నారంటే ఈ యాప్ ఎంతమందికి ఎన్ని విధాలుగా లైఫ్ ఇచ్చిందో ఊహించొచ్చు. అయితే ఇదే టిక్‌టాక్‌ యాప్‌ను కొందరు ఆకతాయిలు చిల్లర పనులకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌కు కొన్ని మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. రోజుకు కొన్ని వేలకొద్దీ హిలేరియస్ వీడియోలు పోస్టు చేస్తారు.

    పడిపోయా పడిపోయా అంటూ మెట్ల మీద నుంచి పడిన అమ్మాయి

    గాన్జీబాయ్ అనే ట్విటర్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఓ యువతి టిక్‌టాక్‌లో చేసిన వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా అనిపించింది. ట్విటర్‌లో టిక్‌టాక్ వీడియో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. ఇది మన తెలుగమ్మాయి చేయడం విశేషం. సందీప్ కిషన్ నిషా అగర్వాల్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డీకే బోస్ నుంచి పడిపోయా పడిపోయా అనే పాటను టిక్‌టాక్‌లో చేసింది. మెట్లు ఎక్కుతూ ఈ పాటను రికార్డు చేసింది. ఇక పైకి ఎక్కిన తర్వాత కింద కూర్చునే క్రమంలో ఆమె పొరపాటున జారి మెట్ల కిందకు పడిపోయింది. ఇది కూడా రికార్డు అయ్యింది. పడిపోయా అనే పాటలో నిజంగానే అమ్మాయి కిందకు పడిపోయింది.

    సెలబ్రిటీగా మారుతుందా..?

    సెలబ్రిటీగా మారుతుందా..?

    పాట మీద కెమెరా మీద దృష్టి పెట్టిన అమ్మాయి మెట్లు ఎక్కింది. అయితే మెట్లపై కూర్చునే సమయంలో వాటిని చూడలేదు. ఎందుకంటే ఆమె దృష్టంతా కెమెరా వైపు ఉంది. అనుకోకుండా జారి ఒక్కసారిగా కిందకు పడింది. ఇది కూడా టిక్‌టాక్‌లో రికార్డు అయ్యింది. ఈ వీడియోను ట్విటర్‌లో పెట్టగా పలువురు పలురకాలుగా కామెంట్లు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ తెలుగమ్మాయికి ఏమైనా అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాలి. ఇప్పటికే సామాన్యులుగా ఉన్న వ్యక్తులను టిక్‌టాక్ యాప్ సెలిబ్రిటీలుగా మార్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+