తప్పిపోయిన పూజారి భార్యను రేప్ చేసి చంపేశారు
లక్నో: శనివారం సాయంత్రం అదృశ్యమైన స్థానిక పూజారి భార్య ఆదివారం శవమై కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఛత్రవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌పుత్నా మజ్రా గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ హత్య కేసులో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్ధానిక పూజారి భార్యను అత్యంత దారుణంగా రేప్ చేసి ఆ తర్వాత హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఏదో పని మీద శనివారం బయటకు వెళ్లిన పూజారి భార్యను రేప్ చేసి, ఆ తర్వాత హత్య చేసి గ్రామ సమీపంలోని పొలాల్లో శవాన్ని పోలీసులు పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications