వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ కాంగ్రెసు ఎంపీ: కూతురు సారా మోడీకి వకాల్తా

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కాంగ్రెసు పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయన కూతురు సారా టెండూల్కర్ మాత్రం బిజెపి నేత నరేంద్ర మేడీ తరపున వకాల్తా తీసుకుంటోంది.

భవిష్యత్తులో తాను నరేంద్ర మోడీని భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు సారా టెండూల్కర్ చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నరేంద్ర మోడీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారని, మోడీయే మన భావి ప్రధాని కాబోతున్నారని ఆమె అన్నది.

Tenduklakr's daughter wants Modi as PM

నరేంద్ర మోడీపై సారా టెండూల్కర్ ఇటీవల ట్విట్టర్‌లో ఆ వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, సోషల్ మీడియాలో సారా టెండూల్కర్ వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. సారా టెండూల్కర్ వ్యాఖ్యల కోసం ట్విట్టర్‌లో విస్తృతంగా గాలించారు. అయితే, ఆ పేరు మీద చాలా ట్విట్టర్ ఖాతాలున్నాయి.

అసలు ఖాతను పట్టుకోవడం కష్టమే అవుతుంది. టెండూల్కర్‌ను కాంగ్రెసు రాజ్యసభకు నామినేట్ చేయడం వల్ల, ఆయన కూతురు సారా మోడీని బలపరుస్తుండడం వల్ల ఆ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

English summary
Rajyasabha member and former cricketer Sachin Tendulkar's daughter Sara Tendulkar wants to see BJP leader Narendra Modi as PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X