వాటర్ బిల్లు డీఫాల్టర్లలో టెండూల్కర్, బాల్ థాకరే
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరపాలక సంస్థ వాటర్ బిల్లు డీఫాల్టర్లలో జాబితాలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు చోటు చేసుకుంది. ఆయనతో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అబూ అజ్మీ, బాల్ థాకరే పేర్లు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎఆర్ ఆంతులే కుటుంబ సభ్యులు కూడా డీఫాల్టర్లలో ఉన్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ ఏడాది జనవరి 16వ తేదీ ప్రకారం బిఎంసి 2 లక్షల మంది నుంచి వేయి కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వసూలు చేయాల్సి ఉంది. రాష్ట్ర సమాచార కమీషనర్ ఆదేశాల మేరకు ఆ జాబితాను బిఎంసి ఇటీవల తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
డిఎన్ఎ వార్తాకథనం ప్రకారం - రావాల్సిన సొమ్మును బట్టి చర్యలు తీసుకుంటామని బిఎంసి అధికారులు అటున్నారు ప్రతి బిల్లింగ్ సైకిల్ సందర్భంగా వంద లేదా 500 మంది టాప్ డిఫాల్టర్ల జాబితా తయారు చేస్తామని, జాబితాలో ఉన్నవారెవరైనా వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పలుసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ టెండూల్కర్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య కాంటాక్టులోకి రాలేదని అంటున్నారు. ఆజ్మీ మాత్రం తాను చెల్లించామని, బకాయిలు లేవని అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications