అన్నకు శస్త్రచికిత్స: గైర్హాజరీపై మౌనం వీడిన సచిన్
న్యూఢిల్లీ: పార్లమెంటుకు రాకపోవడంపై తనపై వెల్లువెత్తిన విమర్శలపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎట్టకేలకు మౌనం వీడారు. తన అన్నయ్య అజిత్‌కు బైపాస్ సర్జరీ చేయించడం వల్ల తాను పార్లమెంటుకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఓ కార్యక్రమానికి హాజరైన సచిన్ టెండూల్కర్ తనపై వచ్చిన విమర్శలపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
తనకు ఏ సంస్థ మీద కూడా అగౌరవం లేదని, వైద్యపరమైన అత్యవసర పరిస్థితి వల్ల తాను రాజ్యసభ సమావేశాలకు హాజరు కాలేకపోయానని ఆయన అన్నారు. తన గైర్హాజరీపై అతిగా చర్చించారని, తనకు ఏ వ్యవస్థను కూడా అగౌరవపరచాలనే ఉద్దేశం లేదని అన్నారు.

కొన్ని విషయాలను తాను వ్యక్తిగత స్థాయిలోనే ఉంచాలని భావిస్తానని, తన సోదరుడికి చికిత్స జరుగుతున్నప్పుడు తాన పక్కన ఉండాల్సి వచ్చిందని చెప్పారు. సచిన్ టెండూల్కర్, రేఖ సమావేశాలకు హాజరు కాకపోవడంపై శుక్రవారం రాజ్యసభలో చైర్మన్ హమీద్ అన్సారీ క్లీన్ చిట్ ఇచ్చారు.
వారిద్దరు ఏ విధమైన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడలేదని, వరుసగా 60 రోజులకు పైబడి వారు గైర్హాజరైన సందర్భం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది సచిన్ టెండూల్కర్ అసలు రాజ్యసభకు హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications