ప్రపంచంలోనే..: రజనీకాంత్‌పై లియాండర్ పేస్ ప్రశంసల వర్షం
చెన్నై: టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ సూపర్ స్టార్ రజనీకాంత్ పైన ప్రశంసలు కురిపించారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి రజనీ అని చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా రజనీకాంత్ ఎంతో ఎత్తుకు ఎదుగుతూ వస్తున్నారన్నారు. ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో భాగంగా చెన్నై వచ్చిన ఆయన మాట్లాడారు.

రజనీకాంత్ ఎన్నో విజయాలి సాధించారని, ఎంతో ఎత్తుకు ఎదిగారన్నారు. ఈ ప్రపంచంలో తాను అత్యంత గౌరవించే వ్యక్తి రజనీకాంత్ అన్నారు. సినిమాల్లో అతని విజయాలు, అతని తోడ్పాటు ఎంతో ఉందన్నారు. మానవత్వానికి ఎంతో విలువ ఇస్తారన్నారు.
గతంలోను పలుమార్లు రజనీకాంత్ పైన లియాండర్ పేస్ ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్ చిత్రాలు తనకు ఆదర్శమన్నారు. రజనీకాంత్ చిత్రాలు తాను చాలా చూశానని, ఆదర్శంగా తీసుకునేవి ఎన్నో ఉన్నాయన్నారు. కాగా, రజనీకాంత్ ఇటీవలి చిత్రం లింగా ఆశించిన విజయం సాధించలేదు.












Click it and Unblock the Notifications