అజార్ కుమారుడు..సానియా చెల్లి: అసద్..ఆనందమీర్జా నిఖా పక్కా: ముహూర్తం ఖరారు..!

ఇద్దరు ప్రముఖ క్రీడాకారులు బంధువులు కానున్నారు. క్రికెట్ హీరో అజారుద్దీన్..టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కుటుంబాలు వియ్యం అందుకుంటున్నాయి. రెండు క్రీడా కుటుంబాల మధ్య ఉన్న స్నేహం కాస్తా బంధుత్వంగా మారనుంది. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ తనయుడు అసద్‌ వివాహం టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చెల్లి ఆనంతో జరుగనుంది. గత కొంతకాలంగా వీరి వివాహంపై వస్తున్న వార్తలను నిజంచేస్తూ.. వారి పెళ్లిని సానియా ధృవీకరించారు.

ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సానియా ఈ అసద్‌-ఆనంల పెళ్లి విషయాన్ని ప్రస్తవించారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అక్బర్‌ రషీద్‌ను నిఖా చేసుకున్న ఆనం.. అనంతరం వారి బంధానికి గుడ్‌బై చెప్పారు. ఇటీవల అతని నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. అయితే అతనితో దూరంగా ఉంటున్న సమయంలోనే అసద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారిద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించారు.

ప్రేమ..ఇప్పుడు పరిణయంగా..

ప్రేమ..ఇప్పుడు పరిణయంగా..

గతంలోనే ఆనం...అసద్ లు చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఎట్టకేలకు ఆనంమీర్జా తాను కాబోయే వధువు అంటూ తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గతంలోనూ ఆనం, అసద్‌లు తాము చెట్టాపట్టాలేసుకొని దుబాయ్‌లో తిరిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. గతంలో అసద్, ఆనంలు ఒకరికొకరు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తన జీవితంలో అసద్ అత్యంత అద్భుతమైన వ్యక్తి అంటూ ఆనంమీర్జా వ్యాఖ్యానించారు.ఆనంమీర్జా ఫ్యాషన్ స్టైలిస్టుగా లబేల్ బజార్ పేరిట ఫ్యాషన్ ఔట్ లెట్ నిర్వహిస్తున్నారు.

అసద్..ఆనందమీర్జాల

అసద్..ఆనందమీర్జాల

అజారుద్దీన్ కుమారుడైన అసద్ న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. అసద్..ఆనందమీర్జాల వివాహం ఈ ఏడాది డిసెంబరులో స్నేహితులు.. కుటుంబసభ్యుల సమక్షంలో జరగనుందని సానియా మీర్జా ప్రకటించారు. టెన్నిస్ స్టార్ గా ఉన్న సానియా క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్నారు. అదే విధంగా అజారుద్దీన్ భారత క్రికెట్ టీం కు కెప్టెన్ గా వ్యవహరించటంతో పాటుగా రాజకీయంగానూ రాణించారు. ఆయన ఎంపీగా పని చేసారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

అజారుద్దీన్

అజారుద్దీన్

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఈ మధ్య కాలంలోనే ఎన్నికయ్యారు. ఆయన తెలంగాణ అధికార పార్టీ టీఆర్ యస్ లో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఇప్పుడు అజారుద్దీన్..సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇప్పుడు ఈ వార్త క్రీడా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+