బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Terrorist: బాంగ్లాదేశ్ లో హత్య, ఐటీ హబ్ లో తిష్ట, ఆల్ ఖైదాతో లింక్ !, వీడు బెంగళూరులో ఏం చేశాడంటే, షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ లో తలదాచుకుంటే ఎవ్వరూ తనను గుర్తించలేరని, తాను ఏమి చేసినా పట్టించుకోరని ఓ వ్యక్తి అనుకున్నాడు. బంగ్లాదేశ్ లో ఓ బ్లాగర్ ను అతికిరాతకంగా హత్య చేసిన నలుగురికి ఆదేశంలోని కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్షపడిన నలుగురిలో ఒకడు చాకచక్యంగా పశ్చిమ బెంగాల్ చేరుకుని అక్కడి నుంచి ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని తలదాచుకున్నాడు. తప్పుడు పత్రాలు తయారు చేసి ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు తీసుకున్నాడు. ఉరిశిక్షపడి తప్పించుకున్న నిందితుడి కోసం బంగ్లాదేశ్ పోలీసులు గాలించారు. పక్కాసమాచారం అందడంతో బెంగళూరు చేరుకున్న బంగ్లాదేశ్, కోల్ కత్తా పోలీసులు నిందితుడిని పట్టుకున్నాడు. ఐటీ హబ్ లో ఆటో, క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న హంతకుడు ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులు చెప్పడంతో ఇంతకాలం అతని ఇంటి చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు హడలిపోయారు. పోలీసుల విచారణలో నిందితుడికి సంబంధించి అనేక విషయాలు బయటకు వచ్చాయి.

Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది !Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది !

బంగ్లాదేశ్ లో బ్లాగర్ హత్య

బంగ్లాదేశ్ లో బ్లాగర్ హత్య

బంగ్లాదేశ్ లో బ్లాగర్ అనంత్ విజయ్ దాస్ అనే వ్యక్తిని 2015 మే 12వ తేదిన అతి దారుణంగా హత్య చేశారు. బ్లాగర్ అనంత్ విజయ్ దాస్ హత్య కేసులో నలుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫైజల్ అహమ్మద్ కూడా నిందితుడు.బ్లాగర్ అనంత్ విజయ్ దాస్ ను అతికిరాతకంగా హత్య చేసిన నలుగురికి బంగ్లాదేశ్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్షపడిన నలుగురిలో ఫైజల్ అహమ్మద్ కూడా ఉన్నాడు.

బెంగళూరు చేరుకున్న నిందితుడు

బెంగళూరు చేరుకున్న నిందితుడు

చాకచక్యంగా పశ్చిమ బెంగాల్ చేరుకున్న ఫైజల్ అహమ్మద్ అక్కడి నుంచి ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని బోమ్మనహళ్ళిలో తలదాచుకున్నాడు. తాను అసోంలోని సిలచర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నానని, తన పేరు సాహిద్ మంజూదార్ అని అందరిని నమ్మించాడు. అప్పటి నుంచి బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ గా, ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు.

 నకిలీ పేరుతో పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి

నకిలీ పేరుతో పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి

తప్పుడు పత్రాలు తయారు చేసి ఫైజల్ అహమ్మద్ తన పేరు సాహిద్ మంజూదార్ అని చెప్పి ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ఆటో, క్యాబ్ నడుపుతున్న ఫైజల్ అహమ్మద్ బోమ్మనహళ్లితో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న మదరసాలకు వెళ్లి జీహాద్ కు సంబంధించి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు.

బంగ్లా పోలీసులకు పక్కాసమాచారం అందింది

బంగ్లా పోలీసులకు పక్కాసమాచారం అందింది


ఉరిశిక్షపడి తప్పించుకున్న నిందితుడి ఫైజల్ అహమ్మద్ కోసం బంగ్లాదేశ్ పోలీసులు గాలించారు. నిందితుడు భారత్ లో తలదాచుకున్నాడని పక్కాసమాచారం అందడంతో బంగ్లాదేశ్ పోలీసులు పశ్చిమ బెంగాల్ పోలీసులను సంప్రాధించి ఫైజల్ అహమ్మద్ అరెస్టుకు సహరించాలని మనవి చేశారు.

 ఆల్ ఖైదాతో నిందితుడికి లింక్ !

ఆల్ ఖైదాతో నిందితుడికి లింక్ !

బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ పోలీసులు బెంగళూరు చేరుకుని బోమ్మనహళ్ళిలో తలదాచుకున్న ఫైజల్ అహమ్మద్ ను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్, కోల్ కత్తా పోలీసులు ప్రత్యక్షం కావడంతో నిందితుడు ఫైజల్ అహమ్మద్ బిత్తరపోయాడు. ఐటీ హబ్ లో ఆటో, క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న హంతకుడు ఫైజల్ అహమ్మద్ కు ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నాడని బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ పోలీసులు చెప్పడంతో ఇంతకాలం అతని ఇంటి చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు హడలిపోయారు. పోలీసుల విచారణలో ఫైజల్ అహమ్మద్ సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయని సమాచారం.

English summary
Terrorist: Bangladesh terrorist arrested near Bommanahalli in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X