ఏకే 47లే వికెట్లు: ఉగ్రవాదుల క్రికెట్ ఇలాగే ఉంటుంది(వీడియో)
శ్రీనగర్: ఔను వారంతా ఉగ్రవాదులే. కానీ, వారికి అమాయకుల ప్రాణాలు తీయడంతోపాటు క్రికెట్ కూడా ఆడతారు. సాధారణంగా క్రికెటర్లయితే బ్యాట్లు, వికెట్లు, ప్యాడ్లు ఉపయోగించి క్రికెట్ ఆడతారు.. కానీ, వీళ్లు ఉగ్రవాదులు కదా.. అవన్నీ ఎక్కడుంటాయి? దీంతో వారి దగ్గర ఉన్న ఆయుధాలనే ఇలా వాడేసుకున్నారు.
దక్షిణ కశ్మీర్‌లో చోటు చేసుకుందీ ఘటన. ఓ అటవీ ప్రాంతంలో ఆరుగురు ఉగ్రవాదులు ఏకే-47 రైఫిల్‌ను వికెట్‌గా పెట్టి క్రికెట్ ఆడారు. ఈ దృశ్యాన్ని వారిలో ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.
దీంతో ఖాళీ సమయాల్లో ఉగ్రవాదులు క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారని.. మిగతా సమయాల్లో భారత జవాన్లపై, అమాయకులపై దాడులు జరుపుతుంటారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications