ఇండియన్ ఆర్మీ దెబ్బ.. బంకర్లలోకి ఉగ్రవాదులు పరుగులు.. పీవోకే ను ఖాళీ చేస్తున్న పాకిస్థాన్ ఆర్మీ
జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్- భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది.
ఇప్పటికే కఠినమైన చర్యలతో పాకిస్థాన్ ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది భారత ప్రభుత్వం. సింధూ జలాల రద్దు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అయితే పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది. కచ్చితంగా దాడి ఉంటుందని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను బంకర్లు, ఆర్మీ షెల్టర్లలోకి హుటాహుటిన తరలిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో పీఓకేలోని ఉగ్రవాదులను ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ ఇలా చేస్తున్నట్లు సమాచారం.

గతవారం భారత నిఘా వర్గాలకు.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న 42 ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఉగ్రవాద శిబిరాల్లో దాదాపు 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ముష్కరులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ సైన్యం.. ఈ శిబిరాలను ఖాళీ చేయిస్తోంది. ఉగ్రవాదులను సైనిక స్థావరాలు, బంకర్లకు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు పహల్గాం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ నిఘా వర్గాల సమాచారంతో ముష్కరుల జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా ఆర్మీ, సీఆర్ పీఎఫ్,జమ్ము కాశ్మీర్ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications