ఆలీఘడ్ యూనివర్సీటీలో ఉగ్రవాదుల మద్దత్తుదారులా..? ఛీ..!!
ఢిల్లీ/హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిని యావత్ దేశం తీవ్రంగా ఖండించింది. యావత్ ప్రజానీకం కంటతడి పెట్టింది. అమర జవాన్ల త్యాగం మరువం అంటోంది. తీవ్రవాదుల అంతు చూడాలని శపథం చేసింది. దొంగ దెబ్బ తీసిన ముష్కరులను నామరూపాలు లేకుండా చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం అందరి రక్తం మరుగుతోంది. దేశం మొత్తం ఉగ్రదాడిపై ఆగ్రహంతో ఉంది. కానీ ఓ విద్యార్థి మాత్రం ఉగ్రదాడిని సమర్థించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దుశ్చర్యను సమర్థించాడు. జైషే దాడి ఎలా ఉంది..? గ్రేట్ సర్ అంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్ తీవ్ర వివాదంగా మారింది.
అది చూసిన యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే యాక్షన్ తీసుకుంది. ఆ విద్యార్థిని సస్పెండ్ చేసింది. జమ్మూకు చెందిన ఆ విద్యార్థి యూనివర్సీటిలో బీఎస్సీ మేథమేటిక్స్ చదుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా సదరు విద్యార్థికి కొందరు సహచర విద్యార్థులు అండగా నిలిచారు. అతడు చేసిన ట్వీట్‌లో తప్పేముందని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు వీర మరణం పొందారు. శ్రీనగర్ లో విధుల్లో చేరేందుకు జవాన్లు వెళ్తున్నారు. 70 వాహనాల్లో 2వేల 500 మంది జవాన్లను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీశారు. అదను చూసి కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 40మంది జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయాలతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే..!!
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
మనం మనం బరంపురం.. !! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..!












Click it and Unblock the Notifications