Shocking Video: కోతిని పట్టుకుని నడిరోడ్డుపై కొట్టుకుంటూ.. కసి తీర్చుకున్న జనం!

దొంగలను పట్టుకోవడానికి రివార్డ్ ప్రకటించడం చూసుంటారు.. కానీ కోతిని పట్టుకోవడానికి కూడా బహుమతి ప్రకటించారు ఈ ఊర్లో. కోతుల సంగతి మనందరికి తెలిసిందే. మన చుట్టుపక్కల వానరం ఉందంటే చుక్కలు చూపించడం పక్కా. అయితే ఓ గ్రామ ప్రజలకు గత పది రోజులుగా నిద్రలేకుండా చేసిన ఒక కోతి ఎట్టకేలకు చిక్కింది. రోజువారీ పనులకు వెళ్లేవారిపై, ఇంటి ముందు కూర్చున్నవారిపై సడన్‌గా దాడి చేస్తూ ఊరందరినీ వణికించేసింది ఈ వానరం. డజనుకు పైగా గ్రామస్తులను తీవ్రంగా గాయపరచడంతో, బయటకు రావాలంటేనే ప్రజలు చేతుల్లో కర్రలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వీధిలో కొచ్చిన వారిపై విరుచుకుపడటం, కనిపించిన వారిని కరిచేయడంతో హర్యానాలోని పాల్వాల్ జిల్లా హాతిన్ గ్రామం భయంతో వణికిపోయింది. రోజులు గడుస్తున్నా దాని ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడంతో గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గజగజలాడిపోయారు.

Terrorizing Monkey Captured In Haryana Palwal After Rs 51000 Reward Angry Locals Slap Captured Animal

రూ. 51,000 బహుమానం.. తుది ఘట్టంలో బోనులో చిక్కింది!

ఈ కోతి ఆగడాలు మితిమీరిపోవడంతో ఊరి ప్రజల్లో ధైర్యం నింపేందుకు హతీన్ మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ భర్త ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ కోతిని పట్టుకున్న వారికి రూ. 51,000 నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దీంతో పలువురు యువకులు, స్థానికులు తీవ్రంగా శ్రమించి, ఎన్నో ప్లాన్లు వేసి ఎట్టకేలకు పది రోజుల తర్వాత ఆ కోతిని సురక్షితంగా బంధించారు.

తల్లి శవంపైనే నిద్రపోయిన పిల్ల కోతి! హార్ట్ టచింగ్ వీడియో
తల్లి శవంపైనే నిద్రపోయిన పిల్ల కోతి! హార్ట్ టచింగ్ వీడియో

కోతిని పట్టుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. బంధించిన కోతిని ఒక వ్యక్తి తన వీపుపై ఎత్తుకుని వెళ్తుండగా, స్థానికులు కేరింతలు కొడుతూ అతని వెంటే నడిచారు. పది రోజులుగా అది పెట్టిన తిప్పలు గుర్తుకొచ్చి, ఆగ్రహం ఆపుకోలేక కొందరు జనం ఆ కోతిని చెంపలపై కొడుతూ తమ కసి తీర్చుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని మరో ఇద్దరు బైక్‌పై ఎక్కించుకుని కోతిని తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

క్వార్టర్ తాగిన కోతి.. వైన్ షాప్ ఓనర్‌కు షాకిచ్చిన వానరం: VIRAL VIDEO
క్వార్టర్ తాగిన కోతి.. వైన్ షాప్ ఓనర్‌కు షాకిచ్చిన వానరం: VIRAL VIDEO

సోషల్ మీడియాలో వైరల్ వీడియో

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. భయం వీడి ఊపిరి పీల్చుకున్నందుకు సంతోషపడాలో, దొరికిన జంతువుపై ఇలా ప్రతాపం చూపినందుకు బాధపడాలో తెలియక నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా, రోజులు తరబడి భయపెట్టిన కోతి చిక్కడంతో హాతిన్ వాసులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+