ఎయిర్ ఇండియా విమానంలో అద్భుతం.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
తరచూ విమాన ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. ఇటీవలి కాలంలో అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానంలో అద్భుతం జరిగింది. మస్కట్ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి.. విమానంలోనే ప్రసవించింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో అద్భుతం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం మస్కట్ నుంచి ముంబై వస్తున్న క్రమంలో థాయ్ లాండ్ కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు ప్రసవించింది. ఆమెకు విమానంలోని క్యాబిన్ సిబ్బంది.. ఒక నర్సు సాయం చేశారు. దీంతో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది.
A Thai passenger gave birth to a healthy baby mid-air on board an Air India Express flight from Muscat to Mumbai, with the airline’s cabin crew stepping in to assist the delivery #AirIndiaExpress #Flight #Mumbai #Viral #CabinCrewhttps://t.co/l3BhbQAsro pic.twitter.com/m8veMVcdK7
— News18 (@CNNnews18) July 24, 2025
థాయ్ లాండ్ కు చెందిన మహిళకు పురిటినొప్పులు వచ్చాయి.. వెంటనే విమాన సిబ్బంది స్పందించింది. జాతీయుడికి ప్రసవ వేదన ప్రారంభమైన వెంటనే, సిబ్బంది వేగంగా స్పందించారు. విమాన సిబ్బంది, నర్సు సాయంతో ఆ మహిళ విమానంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అప్రమత్తం చేశారు. ముంబైలో ల్యాండింగ్ ను కోరారు. అక్కడ వైద్య సిబ్బంది.. అంబులెన్స్ సిద్ధంగా ఉన్నాయి.

ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత తల్లి, బిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications