ప్రేమ, పెళ్లి.. రూ.60 లక్షల మోసం.. థాయ్ మహిళను నిలువునా ముంచిన కిలాడీ!

సోషల్ మీడియా ద్వారా పరిచయమై పెళ్లి చేసుకుని ఆపై రూ.60 లక్షలు కాజేసి మోసం చేశాడంటూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తిపై థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఇర్ఫాన్ అనే లెదర్ వ్యాపారి తనను మోసం చేశాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.

మంచు మొదలైంది! ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో వర్షాలు?
మంచు మొదలైంది! ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో వర్షాలు?

అసలేం జరిగిందంటే?
థాయ్‌లాండ్‌లో రెస్టారెంట్, క్యాంటీన్ నడుపుతున్న అప్సార్ అనే మహిళకు, కాన్పూర్‌కు చెందిన ఇర్ఫాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో తాను అవివాహితుడినంటూ నమ్మిచిన ఇర్ఫాన్ రెండేళ్ల క్రితం థాయ్‌లాండ్‌‌లో ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వ్యాపార అవసరాలు, ఇతర ఆర్థిక అవసరాలంటూ ఇర్ఫాన్ ఆమెను డబ్బు అడిగాడు. దీంతో అప్సార్ తన రెస్టారెంట్ సంపాదన, బంధువుల దగ్గర అప్పు చేసి విడతలవారీగా దాదాపు రూ.60 లక్షలు అతనికి సమర్పించుకుంది. ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఇర్ఫాన్ ఆమెతో సంబంధాలు తెంచుకుని ఇండియాకు వచ్చేశాడు.

Thai Woman Married Kanpur Man Defrauded of Rs 60 Lakhs First Marriage Hidden Full Details Here

భర్త నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అప్సార్ అక్టోబర్ 6, 2026న నేరుగా కాన్పూర్‌లోని ఇర్ఫాన్ ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమెకు అసలు నిజం తెలిసింది. ఇర్ఫాన్ కు ఇదివరకే పెళ్లయిందని, అతనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తాను మోసపోయానని నిలదీయడంతో పాటు డబ్బులు వెనక్కి ఇవ్వాలని అప్సార్ కోరగా.. ఇర్ఫాన్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తనతో కలిసి ఉండాలన్నా, లేదా డబ్బులు వెనక్కి రావాలన్నా ఇస్లాం మతంలోకి మారి బురఖా ధరించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.

షాకింగ్ క్రైమ్: భార్యను చంపి... 3 రోజులు శవంతోనే ఒకే గదిలో!
షాకింగ్ క్రైమ్: భార్యను చంపి... 3 రోజులు శవంతోనే ఒకే గదిలో!

ఈ మోసంపై బాధితురాలు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఈస్ట్) శివ సింగ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ వ్యవధిలో మత మార్పిడి కోణం కూడా ఉండటంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడు ఇర్ఫాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యారేజ్ డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీలు, మత మార్పిడి ఆరోపణలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+