Thalapathy Vijay: సిఏఏ అమలును వ్యతిరేకిస్తున్న దళపతి విజయ్.. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి!!
దేశంలో పౌరసత్వ సవరణచట్టం తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్రప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు చేసిన ఈ సంచలన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయవర్గాలలో చర్చనీయాంశమైంది. 2019లోనే పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడానికి ఏకైక కారణం.. విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాల వారికి పౌరసత్వం కల్పించి ఒక ముస్లింలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించడంతో దేశంలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి.
ఇక లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం చేసిన సంచలన ప్రకటనను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై తమిళ నటుడు , తమిళగ వెట్రి కళగం చీఫ్ దళపతి విజయ్ తీవ్రంగా స్పందించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ చట్టాన్ని తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వానికి దళపతి విజయ్ విజ్ఞప్తి చేశారు.

ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని ప్రజలకు నేతలు హామీ ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని దళపతి విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా కలిసిమెలిసి సామాజిక సౌభ్రాతృత్వంతో జీవిస్తున్న వేళ ఇటువంటి వివాదాస్పదమైన చట్టాన్ని అమలు చేయడం సరికాదని విజయ్ సిఏఏ అమలును తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇదిలా ఉంటే సిఏఏ అమలు చేయబోమని ఇప్పటికే అనేక రాష్ట్రాలు స్పష్టం చేశాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని తేల్చి చెప్పారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సైతం సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టంపై ప్రజలు రానున్న లోక్సభ ఎన్నికలలో స్పందిస్తారని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి తప్పుపడుతోంది ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని ఎన్నికల బాండ్ల వ్యవహారం నుంచి దృష్టి మరలచడం కోసమే దీనిని తెరమీదకి తీసుకువచ్చారని ఆరోపిస్తున్నారు.
ఐదేళ్లపాటు పెండింగ్లో పెట్టిన సిఏఏ నిబంధనలను ఉన్నపళంగా ఎన్నికలవేళ అమలు చేయడం వెనుక కారణం ఏమిటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే దళపతి విజయ్ కూడా దీనిని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications