వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురు, కొడుకుపై కన్న తండ్రి లైంగిక వేధింపులు

|
Google Oneindia TeluguNews

థానే: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి చిన్నారులపై కాటేసేందుకు ప్రయత్నించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ తండ్రి తన కూతురు, కుమారుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది.

కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న నిందితుడు అశోక్ సింగ్(32)ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు అశోక్ తన కుమారుడు(13), కూతురు(10) గత రెండేళ్ల కాలం నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

Thane: Father Booked for Alleged Sexual Abuse of Son, Daughter

ఈ విషయాన్ని గమనించిన నిందితుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడు అశోక్ సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు మిరా రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సురేష్ ఖేడేకర్ తెలిపారు.

నిందితుడు తన ఆకృత్యాలను బయటికి చెప్పకూడదని తన భార్యను పలుమార్లు బెదిరింపులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఐపిసి 377, 354, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సురేష్ ఖేడేకర్ చెప్పారు.

English summary
A civil contractor from Mira Road locality here was arrested for allegedly sexually abusing his two children for the last two years, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X