లైంగిక వేధింపు: వేగంగా వెళ్తున్న ఆటో నుండి దూకిన యువతులు
థానే: మహారాష్ట్రలోని థానేలో ఇద్దరు యువతులు.. ఆటో డ్రైవర్ వేధింపుల నుండి తప్పించుకునేందుకు వేగంగా వెళ్తున్న ఆ ఆటోలో నుండి దూకేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరిగిందని స్థానిక పోలీసులు సోమవారం తెలిపారు.
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యక్రమానికి వెళ్లిన సారికా పాటిల్ (22), ప్రతిక్ష పూర్ణిక (17)లు ఓ ఆటో ఎక్కారు. వారు మల్హార్ టాకీస్ వద్ద బీవండిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఎక్కారు.

ఆటో కాడ్బరీ జంక్షన్‌కు చేరుకున్న తర్వాత ఆటో డ్రైవర్ వారిని వేధించే ప్రయత్నం చేశాడు. ఆటోను వారు చెప్పిన వైపు కాకుండా మరో రోడ్డుకు మళ్లించాడు. దానిని వారు గుర్తించారు. గట్టిగా అరిచారు.
ఆటో వేగంగా వెళ్తున్నప్పటికీ.. ఆటో డ్రైవర్ తీరును గమనించి అందులో నుండి దూకేశారు. గాయాలైన వారు పక్కనే కనిపించిన జూపిటర్ ఆసుపత్రిలోకి వెళ్లారు. విర్తక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications