థానే ఊచకోత షాక్: సోదరికి హస్నాని లైంగిక వేధింపు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన థానే ఊచకోత హత్యల ఘటనలో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. కామర్స్ పట్టభద్రుడైన హస్నాని అన్వర్ వరేకర్ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ముగ్గురు చెల్లెళ్లతో సహా పద్నాలుగు మందిని కర్కశంగా గొంతులు కోసి చంపి, ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ హత్యల్లో హస్నాని సోదరి సుబినా ఒక్కతే ప్రాణాలతో బయటపడింది. ఈ కిరాతక ఘటనకు ఆమె ప్రత్యక్ష సాక్షి. సుబినా తెలిపిన వివరాల ప్రకారం.. మానసిక వికలాంగురాలు, అవివాహిత అయిన తన మరో చెల్లెలు బతుల్‌ని హస్నాని తరచూ లైంగికంగా వేధించేవాడు.

బతుల్ ఈ విషయం ఇతర సోదరీమణులతో చెప్పింది. వాళ్లంతా ఈ దారుణంపై చర్చించుకున్నారు. బహుశా అది గ్రహించిన హస్నాని కుటుంబ సభ్యులందరినీ మట్టుబెట్టాలనే నిర్ణయానికొచ్చినట్టు హస్నాని పోలీసుల దగ్గర సందేహం వ్యక్తం చేసినట్టు థానే నగర సంయుక్త పోలీసు కమిషనర్ తెలిపారు.
కాగా, తన కుటుంబంలోని 14 మందిని హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డ హస్నాని అన్వర్ వారేకర్‌కి 67 లక్షల రూపాయల అప్పు ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications