లవ్ ఫెయిల్: ప్రియుడి ఆత్మహత్య: వీడియో కాల్, లైవ్ లో చూసిన ప్రియురాలు, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

థాణే: ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందని జీవితంపై విరక్తి పెంచుకున్న యువకుడు ప్రేయసికి వీడియో కాల్ చేసి తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాహారాష్ట్రలోని థాణే నగరంలో జరిగింది. హనీ అస్వాని (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

హీరోయిన్ కంటే అందంగా, వందల కోట్ల ఆస్తి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం, చివరికి ఆమె !

థాణేలోని ఉల్లాసనగర్ లో హనీ అస్వాని నివాసం ఉంటున్నాడు. ఇతను కాలేజ్ లో స్నేహితురాలు అయిన యువతిని ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించాడు. ఆమె హనీ అస్వానీని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.

 అక్కడే చెడింది !

అక్కడే చెడింది !

చిన్న విషయంలో ఇద్దరి మధ్య బిన్నాభిప్రాయాలు వచ్చాయి. తరువాత ఇద్దరూ గొడవపడ్డారు. వీరి గొడవ పెద్దదై ప్రేమకు బ్రేక్ పడింది. ప్రేమించిన అమ్మాయికి దూరం అయిన హనీ అస్వాని ఒంటరి జీవితం గడపలేకపోయాడు.

పెద్దలు చెప్పిన వారితో పెళ్లి !

పెద్దలు చెప్పిన వారితో పెళ్లి !

పెద్దలు చూసిన సంబంధంలోనే పెళ్లి చేసుకోవాలని హనీ అస్వాని, అతని మాజీ ప్రియురాలు నిర్ణయించారు. ఈ విషయంపై ఇద్దరూ చర్చించుకున్నారు. తరువాత ఇద్దరూ మాట్లాడుకుని దూరం అయ్యారు. ప్రియురాలిని మరిచిపోలేని హనీ అస్వాని నరకం అనుభవించాడు.

మళ్లీ రచ్చరచ్చ అయ్యింది !

మళ్లీ రచ్చరచ్చ అయ్యింది !

మే 21వ తేదీన హనీ అస్వాని, అతని మాజీ ప్రియురాలు గతంలో వారు కలుసుకునే చోట కలిశారు. ఇద్దరూ మళ్లీ గొడవపడ్డారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందని సమాచారం. తరువాత ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వీడియో కాల్ లైవ్ !

వీడియో కాల్ లైవ్ !

ప్రియురాలిని వదిలి జీవించలేనని హనీ అస్వాని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అంతే ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. తరువాత ప్రియురాలు లైవ్ లో చూస్తుండగానే అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రియురాలు లైవ్ లో చూసింది !

ప్రియురాలు లైవ్ లో చూసింది !

హనీ అస్వాని ప్రాణాలు విడిచిన క్షణాలను అతని ప్రియురాలు లైవ్ లో చూసింది. ప్రేమ విఫలం కావడం వలనే హనీ అస్వాని ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని హిల్ లైన్ పోలీసులు చెప్పారు. హనీ అస్వాని చావును లైవ్ లో చూసిన ఆమె మాజీ ప్రియురాలు షాక్ కు గురై విషాదంలో మునిగిపోయిందని పోలీసులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 26-year-old man allegedly committed suicide by hanging himself in Ulhasnagar township here after a tiff with his ex-girlfriend and live streamed the final moments to her through a video call.
Please Wait while comments are loading...