‘థ్యాంక్యూ జేఎన్‌యూ’: ఎగిరిన ఐఎస్, పాక్ జెండాలు
శ్రీనగర్: జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ శివారు ప్రాంతంలో శుక్రవారం ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం నగరంలో పార్లమెంటుపై దాడి కేసులో ఉరి శిక్ష పడిన అఫ్జల్ గురు మద్దతుదారులకు, భద్రత సిబ్బందికి మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
భద్రత సిబ్బందిపై పలువురు రాళ్లు రువ్వారు. ‘థ్యాంక్యూ జేఎన్‌యూ', ‘అఫ్జల్ గురు అవర్ హీరో' అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దాదాపు 200 మంది వరకు ఉన్న ఆందోళనకారులు బ్యానర్లు చేతబట్టి నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
Srinagar (J&K): Clash between police & protesters who carried "Thank JNU" poster, and ISIS flags. pic.twitter.com/oTrokvw5b7
— ANI (@ANI_news) February 19, 2016
కాగా, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారు. అంతేకాక పాకిస్థాన్, ఐసిస్ జెండాలు ఎగురవేశారు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్‌గురును ఉరితీసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో అఫ్జల్‌గురుకు మద్దతుగా నినాదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications