వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ వీడియో అని ముందే చెప్పా.. కడిగిన ముత్యంలా బయటకు వస్తా: గోరంట్ల మాదవ్

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ గోరంట్ల మాదవ్ న్యూడ్ వీడియోకు సంబంధించి అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ వీడియో ఒరిజినల్ కాదని తెలిపారు. ఒరిజినల్ వీడియో నిర్ధారించడానికి విచారణ జరుగుతుందన్నారు. ఎస్పీ మీడియాతో మాట్లాడారో లేదో.. ఆ వెంటనే ఢిల్లీలో మాదవ్ ప్రత్యక్షం అయ్యారు. వీడియోలో ఉంది తాను కాదని చెప్పానని గుర్తుచేశారు. తాను చెప్పేది వినలేదని, పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.

ఫేక్ వీడియో అని చెప్పా..

ఫేక్ వీడియో అని చెప్పా..

వీడియో ఫేక్ వీడియో అని ముందే చెప్పాన‌ని మాధ‌వ్ అన్నారు. అది వంద శాతం ఫేక్ వీడియో అని చెప్పాన‌ని ఎంపీ కామెంట్ చేశారు. ఆ వీడియోను తాను పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు. వీడియో వ‌చ్చాక కూడా త‌న ప‌నులు తాను చేసుకున్నాన‌ని వెల్ల‌డించారు. వీడియోపై న్యాయ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న చెప్పారు. వీడియోను సృష్టించిన వారిపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని తెలిపారు.

 క్రియేట్ చేసింది ఎవరు

క్రియేట్ చేసింది ఎవరు


త‌న‌పై ఈ వీడియో ఎందుకు సృష్టించార‌నే విష‌యాన్ని వీడియోను అప్‌లోడ్ చేసిన వారినే అడ‌గాలని కోరారు. ఈ వ్య‌వ‌హారంలో తాను క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌ప‌డ‌తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. త‌న‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకే వీడియో సృష్టించార‌ని ఎంపీ మాదవ్ ఆరోపించారు. తాను చెప్పింది ఇప్పుడు నిజమయ్యిందని పేర్కొన్నారు.

Recommended Video

ఏపీలో నాయీ బ్రహ్మణులను అలా పిలిస్తే చర్యలే *AndhraPradesh | Telugu OneIndia
 ప్రజాభీష్టమే

ప్రజాభీష్టమే


గెలుపు ఓటములు అనేవి ప్రజాభీష్టం అని మాదవ్ స్పష్టంచేశారు. కానీ వాటిని ఎవరూ నిర్ణయించలేరని తెలిపారు. గెలుపులను మీడియా అధినేతలు నిర్ణయించలేదని వివరించారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ గురించి కూడా మాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్ చేసి కాసేపు ఆనందం పొందారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు అని మాదవ్ గుర్తుచేశారు.

English summary
that one is fake video previous i'm told gorantla madhav said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X