వివాహిత మహిళపై గ్యాంగ్ రేప్, ఆంటీ గుర్తులు చిక్కకుండా లిక్కర్ పోసి కాల్చి బూడిద చేసి పక్కలో !
ఓ వివాహిత మహిళ మీద సామూహిక అత్యాచారం జరిగిందని కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో ఒక మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు, అయితే ఆమె గురించి పూర్తి సమాచారం ఇంకా కనుగొనడం సాధ్యం కాలేదని పోలీసులు అంటున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదని తెలిసింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లోని గుణాలో 50 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి తరువాత ఆమెను దారుణంగా హత్య చేశారని వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం దేశంలో జరుగుతున్న అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన తరువాత ఆమె మీద మద్యం పోసి నిప్పంటించారని పోలీసులు అన్నారు.

శనివారం ఉదయం కలెక్టరేట్ సమీపంలోని నిర్జన ప్రదేశంలో మహిళ కాలిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె నగ్నంగా ఉందని పోలీసులు అన్నారు. అయితే మహిళను సజీవ దహనం చేశారా, లేదంటే హత్య చేసిన తరువాత శవం మీద మద్యం పోసి నిప్పంటించారా అని పోస్టుమార్టం నిర్వహించిన తరువాత తెలుస్తోందని పోలీసు అధికారులు అంటున్నారు మహిళ ఎవరు అనే విషయంలో స్పష్టంగా వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
మహిళ ముఖం, ఛాతీపై తీవ్రంగా కాలిన గాయాలు ఉండటంతో ఆమె ఆచూకి గుర్తించడం చాలా కష్టం అయ్యిందని, సమీపంలో ఆమె బట్టలు చెల్లాచెదురుగా కనిపించాయని, చాలా మంది వ్యక్తుల ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అయితే మహిళ శవం పడి ఉన్న ప్రాంతం పక్కనే సూసైడ్ నోట్ చిక్కిందని, కేసు దర్యాప్తు తప్పుదోవ పట్టించడానికి హంతకులు సూసైడ్ నోట్ రాసి ఉండే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. మహిళల మిస్సింగ్ కేసులు ఎక్కడెక్కడ నమోదు అయ్యాయి అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications