బాలీవుడ్ నటి ప్రాపర్టీలో స్పా పేరుతో సెక్స్ రాకెట్, షాకైన హీరోయిన్!

The actress owns the floor in Andheri building on which a Spa where cops busted a sex racket
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు చెందిన ప్రాపర్టీలో కొందరు ఆమెకు తెలియకుండా సెక్స్ రాకెట్ రన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్లలో వస్తున్న సమాచారం మేరకు.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఆమె ప్రాపర్టీలో ఈ చర్యకు పాల్పడుతున్నారట.

మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అంధేరీలోని బిల్డింగ్స్‌లలో ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఆ ప్రాపర్టీ ఆమెకు చెందినదిగా తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్‌ను రట్టు చేసిన పోలీసులు ముగ్గురు మహిళలను వ్యభిచార కూపం నుండి రక్షించారు. తనకు చెందిన ఈ ప్రాపర్టీని ప్రియాంక స్పా సెంటర్‌కు లీజుకు ఇచ్చారు.

స్పా యజమాని మానిక్ సోనికి ఆమె తన ప్రాపర్టీని లీజుకు ఇచ్చారు. మిడ్ డే రిపోర్ట్ ప్రకారం.. సెక్స్ రాకెట్ నడుస్తోందని తెలుసుకున్న పోలీసులు సదరు స్పా సెంటర్ పైన ఈ నెలలో రైడ్ చేశారు.

ఈ వార్తా కథనం ప్రకారం ఈ బిల్డింగ్ హీరోయిన్‌కు చెందినది. ఆమె తన ప్రాపర్టీని లీజుకు ఇచ్చారు. కాగా, పోలీసులు తమ దాడిలో ముగ్గురు యువతులను రక్షించారు. యజమాని మానిక్ సోని పారిపోయాడు. పట్టుబడ్డ యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ రైడ్ నవంబర్ 7వ తేదీన జరిగింది. కాగా, ఈ విషయం తెలిసిన ఆమె షాక్‌కు గురయిందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+