Shirdi: మే 1 నుంచి షిర్డీలో బంద్.. సాయిబాబా ఆలయం కూడానా..!
మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం షిర్డీ(Shirdi) మే 1 నుంచి నిరవధికంగా మూసివేసే అవకాశం ఉంది. సాయిబాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు. ఆలయ భద్రతా అవసరాలను నిర్వహించడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అవసరం లేదని సాయిబాబా ఆలయ నిర్వాహకులు వాదిస్తున్నారు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ పట్టణం ఉంది. సాయిబాబా ఆలయం అహ్మద్‌నగర్-మన్మాడ్ రహదారిపై ఉంది. ఈ ఆలయాన్ని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. షిర్డీ కాయిబాబాను ఏటా మిలియన్ల మంది ప్రజలు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సెంట్రల్ ఇండస్ట్రీయిల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో షిర్డీ విమానాశ్రయాన్ని భద్రత బాధ్యతను కూడా CISFకి అప్పగించారు. ఇప్పుడు సాయిబాబా ఆలయాన్ని రక్షించడానికి ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర బలగాలను కేటాయించింది.

ప్రభుత్వ నిర్ణయంపై ఆలయ పరిపాలన ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మతపరమైన పుణ్యక్షేత్రం అందించే విలక్షణమైన భద్రతా అడ్డంకులను పరిష్కరించడానికి CISFకి తగిన శిక్షణ, అనుభవం లేదని పేర్కొంది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ భద్రత కల్పిస్తున్నారని ఆలయ నిర్వాహకులు చెప్పారు. మెటల్ డిటెక్టర్లు, సీసీటీవీలు, ఇతర భద్రతా ఏర్పాట్లు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయని ట్రస్ట్ అధికారులు వివరించారు. ప్రధాన సాయిబాబా ఆలయం 4.5 ఎకరాలలో విస్తరించి ఉండగా.. షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ కార్యకలాపాలు దాదాపు 350 ఎకరాలలో ఉన్నాయి.
CISF భద్రతను ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్న షిర్డీలో ఉన్న అన్ని మార్కెట్‌లు, రవాణాదారులు, వాణిజ్య, ఆతిథ్య పరిశ్రమల మూసివేతకు పిలుపునిచ్చాయి. పట్టణ ప్రజల సమ్మెతో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (SSST)కి ఎలాంటి సంబంధం లేదని ఆలయ అధికారి ఒకరు చెప్పారు. కానీ సాయిబాబా ఆలయంలో కార్యకలాపాలన్నీ యథావిధిగా పనిచేస్తాయని.. CISF బలగాలు ఎప్పుడు మోహరిస్తాయో తెలియదన్నార. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆలయ ప్రాంగణ నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఇందులో ఉచిత భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. అలాగే స్వచ్ఛంద పాఠశాలలు, కళాశాలలను కూడా నిర్వహిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications