ఆర్మీ దుస్తుల్లో ఆగంతకులు: పంజాబ్‌లో కలకలం
చండీగడ్: పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఆర్మీ దుస్తుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని తెలుసుకున్న సైన్యం, పోలీసు అధికారులు వారి కోసం గాలిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఆర్మీ దుస్తుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
గురుదాస్ పుర్ జిల్లాలోని టిబ్రి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. ఫిరోజ్ పుర్ పాకిస్థాన్ కు సరిహద్దులో ఉన్న జిల్లా. గురుదాస్ పూర్ కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఫిరోజ్ పుర్ ఉంది.

మంగళవారం అనుమానాస్పద వ్యక్తులున్న భవనాన్ని ఆర్మీ అధికారులు చుట్టుముట్టారు. ప్రత్యేక బలగాలు, అదనపు పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి రప్పించారు. భవనం చుట్టు పక్కలు ఆర్మీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
గురుదాస్ పుర్ జిల్లాలోని అన్ని పంటపొలాల్లో, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో సోదాలు చేస్తున్నారు. ఆర్మీ దుస్తుల్లో సంచరిస్తున్న ఇద్దరినీ పట్టుకోవాలని అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. పంజాబ్ లో మరో ఉగ్రదాడి జరగడానికి అవకాశం ఇవ్వకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications