బ్యాంకులోకి వెళ్లిన ఎద్దు ఏం చేసిందంటే ?, వీడియో వైరల్
మనం బ్యాంకులను సందర్శించి మన పనులు మనం పూర్తి చేసుకుని వస్తుంటాము. మన పనిని పూర్తి చేసుకోవడానికి బ్యాంకుల్లో మనం క్యూలో నిలబడతాము. కొన్నిసార్లు బ్యాంకులు రద్దీగా ఉన్నప్పుడు, పని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. దీని కారణంగా మనం చాలా సమయం బ్యాంకులోనే వేచి ఉండాలనే అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు.
అలాంటప్పుడు మనం నిలబడిన లైన్‌లో కాని, పక్కన కాని బాగా బలంగా ఉన్న ఎద్దు కనిపిస్తే ఏం చేస్తాము చెప్పడం చాలా కష్టం. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని షాహ్‌గంజ్ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో కస్టమర్లు వాళ్లు వెళ్లిన పని పూర్తి చేసుకోవడానికి, వాళ్లకు ఇచ్చిన టోకన్ నంబర్ ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆ బ్యాంకులో పెద్ద ఎద్దు దర్శనం ఇచ్చింది.

ఈఘటనతో బ్యాంకు సిబ్బందితో పాటు అదే బ్యాంకులో ఉన్న ప్రజలు అందరూ షాక్‌కు గురయ్యారు. బ్యాంకులోకి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన ఆ ఎద్దు అందరినీ షాక్‌కు గురి చేసింది. వీడియోలో ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఎద్దు స్వేచ్ఛగా తిరుగుతోంది. బ్యాంకులో ఉన్న ప్రజలు భయంతో నిల్చొని దానికి భయపడుతూ దూరంగా నిలబడి ఉన్న విషయం స్పష్టంగా కనిపించింది. ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించడంతో ఆ బ్యాంకులో ఏం జరుగుతుందో అంటూ కొంతసేపు అందరూ టెన్షన్ గా ఎదురు చూశారు.
దీంతో ఆ బ్యాంకు కస్టమర్లు, సిబ్బందిలో భయం నెలకొంది. కొంతసేపటి తరువాత బ్యాంకు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కర్రతో ఎద్దును బ్యాంకులో నుంచి బయటకు తరిమికొట్టేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ గార్డు ఆ ఎద్దును వెంబడించడంతో ఎద్దు బయటకు పారిపోవడం వీడియోలో కనిపించింది. బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బ్రాంచ్ వెలుపల రెండు ఎద్దులు పరస్పరం దాడి చేసుకోవడంతో ఓ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించింది.
उन्नाव- उन्नाव में SBI बैंक में घुसा सांड, बैंक में कैस काउंटर पर पहुंचा सांड
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) January 10, 2024
➡बैंक में सांड घुसने से बैंक में हड़कंप
➡वीडियो सोशल मीडिया पर वायरल
➡शहर के शाहगंज शाखा का मामला.
#Unnao pic.twitter.com/LOef59r1xd
అనంతరం ఓ వ్యక్తి ఆ ఎద్దు మీద దాడి చేసేందుకు బ్యాంకులోకి ప్రవేశించారు. తెరిచిన తలుపు ఎద్దు లోపలికి రావడానికి సులభతరం అయ్యిందని అధికారులు అంటున్నారు. దీంతో కొద్దిసేపు బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ బ్యాంకులో కస్టమర్లు తక్కువగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది అని బ్యాంక్ చీఫ్ మేనేజర్ గౌరవ్ సింగ్ స్థానిక మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications