భార్యకు రూ 2 వేలు ఇచ్చి భర్త దగ్గర రూ 3 వేలు పీకేస్తున్న సీఎం, ప్రతిపక్ష పార్టీల లెక్కలు ఇవే!

కర్ణాటక రాష్ట్రంలో ఆరు, ఏడు నెలలుగా కరువు విలయతాండవం చేస్తున్నప్పటికీ రైతులకు నష్టపరిహారం డబ్బులు విడుదల చేయలేదని, ఇప్పటి వరకు 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సీఎం సిద్దరామయ్య చోద్యం చూస్తూ ఆయన కుర్చీ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విధాన సౌధలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ మండిపడ్డారు.

వెంటనే రైతులకు కరువు సహాయ నిధులు విడుదల చేయాలని, లేదంటే కుర్చీలు ఖాళీ చేయాలని ప్రతిపక్షనేత ఆర్ .అశోక్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోలారు జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డీసీఎం ఆర్.అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి రూ.1, 000 కోట్లు విడుదల చేసిందని అన్నారు. అయితే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఆర్. అశోక్ విమర్శించారు.

 The BJP has accused the Siddaramaiah government of failing to provide drought funds to farmers

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కోలారు జిల్లాలోని రైతుల కోసం రూ 54 కోట్లు విడుదల చేశామని అన్నారు. 2022 డిసెంబర్‌లో కరువు ప్రకటించినప్పుడు బీజేపీ భుత్వం రూ. 3,000 కోట్లు విడుదల చేసిందని, ఒక్కో రైతుకు రూ. 20 వేల నుంచి రూ30 వేలు అందాయని, అయితే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోలారు జిల్లాకు కేవలం రూ. 3 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆర్. అశోక్ ఆరోపించారు.

కర్ణాటక రాష్ట్రంలో 39 కార్పొరేషన్ బోర్డుల ఏర్పాటుకు రూ.150 కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బు ఉందని, అయితే రైతుల సహాయానికి, అభివృద్ధికి డబ్బులు లేవా?, సిద్దరామయ్య పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీసిందా?, మీ ప్రభుత్వం సోమరిపోతు ప్రభుత్వమా ? అంటూ మాజీ డీసీఎం ఆర్ అశోక్ సిద్దరామయ్యను ప్రశ్నించారు. గత 7నెలల నుంచి హామీ జపం చేసి ప్రజాప్రతినిధుల ప్రాథమిక సమస్యల అభివృద్ధిపై విస్మరించారని, రోడ్లు వెయ్యడం లేదని, ప్రాజెక్టుల ఊసేలేదనని అర్ అశోక్ ఆరోపించారు.

మద్యం బాటిల్ క్వార్టర్ మీ రూ. 40 పెంచారని, ఒక్కో బీరు బాటిల్ మీద రూ.30 పెరిగిందని, భర్తల మీద నెలకు రూ.3 వేలు భారం వేసి భార్యకు మాత్రం రూ.2 వేలు చెల్లిస్తూ సిద్ధరామయ్య రూ.1,000 జేబులో వేసుకుని సోనియాగాంధీకి పంపిస్తున్నారని మాజీ డీసీఎం, బీజేపీ నాయకుడు అర్ అశోక్ మండిపడ్డారు. కర్ణాటక ప్రజలను దోచుకుంటున్న సిద్దరామయ్య ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ కు సూట్ కేసులు పంపిస్తున్నారని ఆర్. అశోక్ దుయ్యబట్టారు.

బొమ్మయ్ పరిపాలనలో అప్పులు లేవని, కానీ సిద్దరామయ్య ప్రభుత్వం దివాళా తీసిందని, అప్పుల్లో కూరుకుపోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని, మరో ఏడాదిలో సిద్ధరామయ్య అధికారాన్ని వదిలేస్తారని, కర్ణాటకను ఏటీఎంగా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఆర్. అశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+