మహారాజుల ఫ్యామిలీ కోసం ప్రధాని మోదీ ఏం చేశారంటే ?, రంగంలోకి అమిత్ షా, సీక్రేట్ సర్వే !

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక రాష్ట్రంలో ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయగా, రెండో జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. అటు పార్టీ నేతలు, ఇటు సామాన్య కార్యకర్తలకు కూడా టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నందున కొందరు సిట్టింగ్ ఎంపీలకు కూడా టికెట్లు దక్కకుండా పోయే అవకాశం ఉంది.

బీజేపీ రెండో జాబితా విడుదల కాకముందే ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రజలకు అనుకూలంగా ఎన్నో పనులు చేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాకు ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశం ఉందని సమాచారం. దానికి బదులు మైసూర్ రాజ వంశస్థుడైన యదువీర్ వడయార్ కు బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

The BJP high command conducted a secret survey in the Mysuru Lok Sabha constituency

మైసూరు-కొడగు లోక్‌సభ టికెట్ ప్రతాప్ సింహాకు లేదా యదువీర్ వడయార్ లో ఎవరికి దక్కుతుందనే లెక్కల మధ్యలో బీజేపీ నాయకుల్లో గందరగోళం నెలకొంది. ఇలాంటి సమయంలో మరో వ్యక్తి పేరు తెరమీదకు రావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. మైసూరు బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోందని వెలుగు చూసింది

సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా, యదువీర్ వడయార్ లను పక్కనబెట్టి మరో అభ్యర్థిపై మూడు రోజుల క్రితం కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సర్వే నిర్వహించి నివేదిక తెప్పించుకున్నారని వెలుగు చూసింది. ఈ విషయాన్ని కొందరు బీజేపీ నాయకులు అవును అని అంటున్నారు. ఒక్కలిగ సామాజికవర్గం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విధేయుడైన అభ్యర్థి ఎవరనే విషయమై సర్వే నిర్వహించి నివేదికను సిద్ధం చేసిన బీజేపీ హైకమాండ్ ఆ నివేదికను ముగ్గురి పేర్లతో కలిపి ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించినట్లు సమాచారం.

The BJP high command conducted a secret survey in the Mysuru Lok Sabha constituency

అంతకుముందు బీజేపీ హైకమాండ్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాతో పాటు మడికేరి మాజీ ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్, మైసూరు బీజేపీ సీనియర్ నేత సీహెచ్. విజయ శంకర్ పై సర్వే కూడా జరిపించిందని, బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాకు అనుకూలంగా అధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపించారని వెలుగు చూసింది. బీజేపీ హైకమాండ్ సర్వే చాలా సీక్రేట్ గా జరిగిందని సమాచారం.

బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మైసూర్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు. అంతేకాకుండా ప్రతాప్ సింహా గత 10 సంవత్సరాలల్లో ఎంపీ హోదాలో అనేక అభివృద్ధి పనులు చేశారని నియోజకవర్గంలోని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వెలుగు చూసింది. దీంతో ప్రతాప్ సింహాకు మరోసారి బీజేపీ ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాలని ప్రజలు ఎక్కువగా డిమాండ్‌ చేస్తున్నారని కన్నడ మీడియా అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+