ప్రధాని మోడీ పర్యటన: బెంగళూరులో హై అలర్ట్

బెంగళూరు: భారత ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు పర్యటన సందర్బంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం సోదాలు చేస్తున్నారు. ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వరకు బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఎల్.కే. అద్వాని, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు హాజరు అవుతున్నారు.

ఢిల్లీ నుండి 300 మందికిపైగా వీఐపీలు బెంగళూరు వస్తున్నారని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అన్నారు. ఏప్రిల్ 2,3వ తేదిలలో అశోక్ హోటల్ లో బీజేపీ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి కొందరిని మాత్రం అనువతి ఇస్తున్నామని ఎం.ఎన్. రెడ్డి వివరించారు.

మూడవ తేది సాయంత్రం నేషనల్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని, అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే అన్ని మార్గాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.

 The BJP's national executive will meet on April 3 and 4 in Bengaluru to take

అశోక హోటల్ లో మోడీ బసచేయ్యడానకి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. బెంగళూరు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండ ఇప్పటికే అన్ని జాగ్రతలు తీసుకున్నామని అన్నారు. బెంగళూరు నగర పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని అన్నారు.

నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా ఇప్పటికే రాష్ట్ర డీజీపీతో చర్చించామని, 40 కేఎస్ఆర్పీ బెటాలియన్లు, 30 సీఏఆర్ బెటాలియన్లు, 500 మంది సాయుధ బలగాలు భద్రతా ఎర్పాట్లలో నిమగ్నం అవుతారని వివరించారు. ఎస్కార్ట్, పైలెట్ వ్యవస్థ ఏర్పాటు చేశామని ఎం.ఎన్. రెడ్డి వివరించారు. ప్రధాని పర్యటన సందర్బంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ జాగ్రతలు తీసుకున్నామని ఎం.ఎన్. రెడ్డి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+