రాధే మాకు బెయిల్ ఇచ్చిన హై కోర్టు
ముంబై: వివాదస్పద ఆధ్యాత్మిక గురువు (గాడ్ వూమెన్) రాధే మాకు బాంబే హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ రావడంతో రాధే మాకు ఊరట లభించింది. వరకట్నం వేదింపుల కేసులో రాధే మాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది.
రాధే మా తన అత్తమామలను ప్రేరేపించి వరకట్నం కోసం వేదిస్తున్నారని ఓ వివాహిత ముంబై పొలీసులకు ఫిర్యాదు చేశారు. రాధే మా మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని రాధే మా బాంబే హై కోర్టును ఆశ్రయించారు.

గురువారం బాంబే హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మోహితే డెరే రాధే మా పిటిషన్ ను విచారించారు. రాధే మా తరుపు న్యాయవాది, ముంబై పోలీసుల వాదనలు విన్నారు. వాదనలు పూర్తి అయిన తరువాత రాధే మాకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.
పోలీసులు విచారణకు పిలిచినపుడు హాజరు కావాలని రాధే మాకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. ముంబై పోలీసులు రాధే మాను ఇప్పటికే పలు సార్లు విచారణ చేసి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications