గర్ల్ ఫ్రెండ్ ను ఇలాకూడా చంపుతారా ?, మాట్లాడాలని ఆటో కుర్చోపెట్టిన ప్రియుడు?
ముంబాయి/మహారాష్ట్ర: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరిగేశారు. పెళ్లికి ముందే ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. అయితే పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నో చెప్పారు. ప్రియురాలు ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. ఆటో డ్రైవర్ ను బయటకు పంపించి అదే ఆటోలో మాట్లాడుతున్న ప్రియురాలిని ఆమె ప్రియుడు గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.
మహారాష్ట్రలోని ముంబాయిలోని సకినాగా ప్రాంతంలో పంచశీల సమధార్ అలియాస్ పంచశీల (30) అనే మహిళ నివాసం ఉంటున్నది. ముంబాయిలోని ఉల్షానగర్‌కు చెందిన దీపక్ బోర్సే అలియాస్ దీపక్ గత కొన్నేళ్లుగా స్నేహితులు. రానురాను స్నేహితులు పంచశీల, దీపక్ ప్రేమలో పడ్డారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు దీపక్, పంచశీల సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరిగేశారు. పెళ్లికి ముందే ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. దీపక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీపక్ తో పెళ్లికి పంచశీల కుటుంబీకులు అంగీకరించలేదని సమాచారం. దీనిపై దీపక్, పంచశీల తరచూ గొడవ పడుతుండేవారు.
ఈ క్రమంలో సోమవారం ఘాట్‌కోపర్ ప్రాంతంలోని పంచశీలను చూసేందుకు దీపక్ వెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరూ దీపక్ కు తెలిసిన వ్యక్తి ఆటోలో పంచశీల నివసించే సకినాగ ప్రాంతంలోని నిర్జనప్రదేశం దగ్గరకు వెళ్లారు. ఆ సందర్బంలో సాయంత్రం 4 గంటలు అయ్యింది. ప్రియుడు దీపక్ ఆటో డ్రైవర్ ను పిలిచి తాము వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవాలని, నువ్వు కొంచెం దూరంగా ఉండాలని చెప్పడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆటోలో పంచశీల, దీపక్ ఇద్దరూ వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకోవడంతో మొదలుపెట్టారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన దీపక్ జోబులో ఉన్న పదునైన ఆయుధంతో ప్రియురాలు పంచశీల గొంతు కోశాడు. కేకలు వేస్తూ ఆటోలో నుంచి పంచశీల కిందకు పడిపోయింది. ప్రియురాలు పంచశీలను అక్కడే వదిలేసిన దీపక్ అక్కడి నుంచి పరుగు తీశాడు.
అప్పటికి అటువైపు వెలుతున్న వారు పంచశీలను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యంలోనే పంచశీల మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో రాజావాడి ప్రాంతంలో తలదాచుకున్న హంతకుడు దీపక్‌ను పట్టుకున్నారు. దీపక్ అప్పటికే ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఆటోడ్రైవర్ ప్రధాన సాక్షిగా మారాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు చికిత్స అనంతరం దీపక్ పూర్తిగా కోలుకున్న తరువాత అతన్ని విచారించాలని వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications