Crime News: ప్రియురాలి మృతదేహాన్ని 35 ముక్కలు చేసిన ప్రియుడు.. 18 రోజుల పాటు ఫ్రీజ్‍లో పెట్టి..
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలుగా చేశాడు. వాటిని 18 రోజుల పాటు రిఫ్రీజిరేటర్లో పెట్టి నగరంలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అఫ్తాబ్ అమీన్ అనే వ్యక్తి శ్రద్ధా అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు వారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు.

సహజీవనం
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఇల్లు అద్దేకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో మే 18న వారి మధ్య గొడవ జరిగింది. గొడవ సమయంలో, శ్రద్ధ గట్టిగా అరిచింది. దీంతో అఫ్తాబ్ శ్రద్ధను హత్య చేశాడు. అఫ్తాబ్ హత్య నుంచి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. వాటిని దాచడానికి పెద్ద ఫ్రీజ్ కూడా కొనుగోలు చేశాడు. 18 రోజుల పాటు 35 ముక్కలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. అఫ్తాబ్ ప్రతిరోజూ రాత్రి 2 గంటలకు అటవీ ప్రాంతంలో శరీర భాగాలను పారవేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులకు ఫిర్యాదు
శ్రద్ధ తండ్రి కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి తన కూతురు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. అయితే తన కూతురు అద్దెకు తీసుకున్న ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. శ్రద్ధ హత్యకు గురయినట్లుగా గుర్తించారు. శ్రద్ధ ముంబైలోని ఓ కాల్ సెంటర్ లో పని చేస్తుండగా.. అఫ్తాబ్ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్లారని ఆమె తండ్రి తెలిపారు.

ఫేస్ బుక్ ద్వారా
ఫేస్ బుక్ ద్వారా తన కూతురు అడ్రస్ తెలుసుకున్నాని.. కానీ వచ్చేసారికి ఆమె లేదని చెప్పారు. శ్రద్ధ హిమాచల్ ప్రదేశ్‌ని సందర్శించేందుకు వెళ్లినట్లు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటో ద్వారా అడ్రస్ తెసుకున్నట్లు వివరించాడు. నవంబర్ 8వ తేదీన ఎలాంటి ఛతర్‌పూర్‌లోని కుమార్తె అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన కూతురు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications