మేడమ్ తో మజా చేసి ఆమె భర్తను రివాల్వర్ లేపేసిన బాయ్ ఫ్రెండ్, వీడి స్కెచ్ తో !
ముంబాయి/లక్నో: మహారాష్ట్రలోని ముంబాయి సమీపంలోని కండివాలీలో మనోజ్ నివాసం ఉంటున్నాడు. బంగారు ఆభరణాల దుకాణం నడుపుతున్న అతడు మే 28న అనుమానాస్పద రీతిలో కాల్చి చంపబడ్డాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో కలకలంరేపే విషయాలు, విస్మయకర సమాచారం బయటకు వచ్చింది.
మనోజ్‌కి ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వప్నా సుమా అలియాస్ స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో వివాహం అయ్యింది. మనోజ్, స్వప్నా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని భార్య స్వప్నా రోహిత్ చంద్రశేఖర పాల్ (23) ఏళ్ల యువకుడితో వివాహానికి ముందు నుండి అక్రమ సంబంధం పెట్టుకుంది.

మనోజ్‌తో వివాహం అయిన తరువాత కూడా స్వప్నా రోహిత్ తో అక్రమ సంబంధం కొనసాగించింది. కొంతకాలం క్రితం భర్త మనోజ్ మరియు అతని కుటుంబ సభ్యులకు స్వప్నా, రోహిత్ ల అక్రమ సంబంధం విషయం గురించి తెలుసుకుని షాక్ అయ్యారు. స్వప్నా, రోహిత్‌లను పిలిపించి పంచాయితీలు చేసి వారి అక్రమ సంబంధం మానుకోవాలని హెచ్చరించారు.
అయినా పట్టించుకోకుండా రోహిత్, స్వప్నా నిత్యం కలుసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. గత డిసెంబర్ నెలలో రోహిత్ ప్రియురాలి భర్త మనోజ్ ఇంటికి వెళ్లి స్వప్నాను చూసేందుకు డైరెక్ట్ గా వెళ్లాడు. తరువాత ఇంటిలో ఎవ్వరూ లేరని తెలుసుకున్న రోహిత్ అతని ప్రియురాలు స్వప్నాతో రొమాన్స్ చేస్తున్నాడు. అదే సమయంలో స్వప్నా భర్త మనోజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

స్వప్నా, ఆమె ప్రియుడు రోహిత్ మంచి రసపట్టులో ఉన్న సీన్ చూసిన మనోజ్, అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు. దీంతో కోపోద్రిక్తుడైన మనోజ్, అతని కుటుంబ సభ్యులు రోహిత్‌ను పట్టుకుని చితకబాది తరిమికొట్టారు. స్వప్నాతో తన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించలేకపోతున్నానని రోహిత్ రగిలిపోయాడు. మనోజ్‌ని చంపేసి అతని పీడ వదిలించుకోవాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు.
ఒక కంట్రీ మేడ్ రివాల్వర్ కొనుగోలు చేసిన రోహిత్ ప్రియురాలు భర్త మనోజ్ ను చంపేచాలని డిసైడ్ అయ్యాడు. కొంతకాలంగా సీక్రేట్ గా మనోజ్ కదలికలను రోహిత్ గమనించాడు. మే 27న ఒంటరిగా బైక్ మీద వెలుతున్న ప్రియురాలు స్వప్నా భర్త మనోజ్ ను రివాల్వర్ తో కాల్చి చంపేసిన రోహిత్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు.
మనోజ్ హత్యకు గురైన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మనోజ్, అతని భార్య స్వప్నా సెల్‌ఫోన్ కాల్స్ ను పరిశీలించిన ముంబాయి పోలీసులు హంతకుడు రోహిత్ మ్యాటర్ తెలుసుకుని అతని కోసం వేట ప్రారంభించారు. రోహిత్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు పారిపోయాడని పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ పోలీసులకు ముంబాయి పోలీసులు రోహిత్ గురించి సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు రోహిత్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం రోహిత్‌ను కోర్టులో హాజరుపరచగా, జూన్ 2 వరకు అతడిని పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ హత్యలో మనోజ్ భార్య స్వప్నాకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉందా, లేదా ? అనే కోణంలో ముంబాయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications