అడవిలో ప్రియురాలికి మద్యం తాగించి ఎంజాయ్ చేసి క్లైమాక్స్ లో కోసేసిన ప్రియుడు, ఏదో అయితే ?
తన అక్రమ సంబందం విషయానికి సంబంధించిన రహస్యం భార్యకు తెలిసిపోయిందని భర్త బయపడిపోయాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను, కొడుకును హత్య చేసిన ప్రియుడు అతని భార్యతో సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. అయితే ప్రియురాలి హత్య కేసులో ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులకు మరో హత్య గురించి సమాచారం తెలియడంతో హడలిపోయారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రియురాలిని హత్య చేసిన నిందితుడు తప్పించుకోవడానికి అనేక ప్లాన్లు వేసి చివరికి పోలీసులకు చిక్కలేదు. చివరికి ఉదయ్‌పూర్‌లోని ఫలాసియా పోలీస్ స్టేషన్‌లో ఫరిదిలో మహిళను హత్య చేసిన వ్యక్తిని ఉదయ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సీత అనే మహిళను గొంతు కోసి హత్య చేసిన నిందితుడు దేవిలాల్ పర్మార్ అలియాస్ దేవిలాల్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

నిందితుడు దేవివాల్ అరెస్ట్ తర్వాత మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు దేవిలాల్ గతేడాది తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ సీత 4 ఏళ్ల కొడుకును కూడా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే దేవిలాల్ పర్మార్ తన కొడుకును చంపేశాడని తెలిసినా సీతా ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందని, ఇంత వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఉదయ్ పూర్ పోలీసు అధికారులు తెలిపారు.
దేవిలాల్ పర్మార్‌కు పరిచయం కాకముందే సీతకు వివాహం జరిగింది. భర్తతో కాపురం చేసిన సీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సీతను ఆమె భర్త వదిలేసి వెళ్లిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. సీత తన 4 ఏళ్ల కొడుకును చూసుకునేది. సీత మరో కొడుకు ఆమె పుట్టింటిలో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. తరువాత సీత, దేవిలాల్ కు పరిచయం కావడంతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
దేవిలాల్ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతని ప్రియురాలు సీత కొడుకును గత ఏడాది కొట్టి చంపాడు.
పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం దేవిలాల్ అక్రమ సంబందం విషయం అతని భార్యకు తెలిసిపోయింది. తన వ్యవహారం గురించి భార్యకు తెలియడంతో దేవిలాల్ పర్మార్ అతని భార్యను సంప్రదించి తాను తప్పు చేశానని, త్వరలో ఆ తప్పును సరిదిద్దుకుంటానని భార్యకు నచ్చ చెప్పాడని తెలిసింది.
ఇదే ఏడాది ఏప్రిల్‌లో సీతను చంపడానికి ఆమె ప్రియుడు దేవిలాల్ పథకం పన్నాడు. దేవిలాల్ సీతను అతని బంధువుల ఇంటి దగ్గరకు పిలుచుకుని వెలుతానని ఆమెకు చెప్పాడు. బైక్‌పై కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత దేవిలాల్, సీత రోడ్డు పక్కన ఉన్న దుకాణం వద్ద ఆగారు. తరువాత కొంతసేపటికి అక్కడి నుంచి బయలుదేరారు. తరువాత నిర్జన ప్రదేశంలో దేవిలాల్, సీత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు.
ఆ తర్వాత దేవిలాల్ అతని ప్రియురాలు సీతను అడవికి తీసుకెళ్లి నిర్జనప్రదేశంలో ఆమెతో శారీరక సుఖం పొందాడు. ఇక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని సీతకు చెప్పిన దేవిలాల్ నిద్రపోతున్నట్లు నటించాడు తరువాత కత్తితో సీత గొంతు కోసేశాడు. సీత ఆమె చేతిపై దేవిలాల్ పేరును కూడా టాటూ వేయించుకుంది, దేవిలాల్ అతని ప్రియురాలు సీత చేతి మీద ఉన్న టాటును కత్తితో కోసేసి శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
అడవిలో సీత మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ప్రాథమిక విచారణలో సీత హత్య గురించి ఎలాంటి ఆధారాలు కనుగొనలేకపోయారు. తర్వాత ఒక కానిస్టేబుల్‌కి దేవిలాల్ గురించి అతని మూలాల గురించి తెలిసింది. పోలీసులు దేవిలాల్‌ను పిలిచి విచారణ చేయగా సీతను తానే హత్య చేశానని నేరాన్ని అంగీకరించాడు. ఇదే సమయంలో పోలీసులు బెండ్ తియ్యడంతో సీత కుమారుడిని కూడా గత ఏడాది హత్య చేశానని దేవిలాల్ అంగీకరించాడు. పోలీసులు దేవిలాల్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications