లవ్ మ్యారేజ్, రెండు నెలలకే అల్లుడు చంపేశాడని కేసు, ఇంట్లో ఏం జరిగిందో తెలీదు !
పక్కపక్క ఊర్లలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. రానురాను యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికుల కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి ఇరు వైపుల పెద్దలు నిరాకరించారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రేమికులు ఇంటి నుంచిపారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ప్రియురాలు శవమైకనిపించింది.
బెంగళూరులోని మహదేవపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహదేవపురంలోని సింగయ్యనపాళ్యలో నివాసం ఉంటున్న అనూష(23) మృతి చెందిందని పోలీసులు అన్నారు. సాయంత్రం ఇంట్లో అనూష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, అయితే ఆమెను భర్త హత్య చేశాడని ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కింద అల్లుడు ప్రవీణ్, అతని తల్లి నాగమ్మ, బావమరిది రాజేష్, తాత తిమ్మేగౌడ, వారి కుమారుడు మహేష్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.. కర్ణాటకలోని .
మండ్య జిల్లా మలవల్లి తాలూకా హగదూర్ గ్రామానికి చెందిన అనూష, పక్క పట్టణానికి చెందిన ప్రవీణ్ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమను అనూష కుటుంబం వ్యతిరేకించారు.
రెండు నెలల క్రితం అనూష, ప్రవీణ్‌లు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. అనంతరం బెంగళూరు చేరుకున్న ప్రవీణ్, అనూష మహదేవపురంలోని సింగయ్యనపాళ్యంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రవీణ్ తల్లి నాగమ్మ ఇటీవల బెంగళూరు వచ్చి ప్రేమికుల వెంట ఉన్నారు. ప్రవీణ్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అనూష ఇంట్లోనే ఉంటున్నది.
దీంతో అనూష సాయంత్రం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తగారు నాగమ్మ గదిలోకి వెళ్లగా అనూష ఆత్మహత్య చేసుకునన సంఘటన వెలుగులోకి వచ్చింది. అనూష ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. సంఘటనా స్థలంలో డెత్ నోట్ లేదని పోలీసులు అంటున్నారు. అయితే అల్లుడు ప్రవీణ్‌తో పాటు అతని కుటుంబసభ్యులు వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మహదేవపుర పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications