భారత్‌ను వీడిన షేక్ హసీనా?: ఎమిరేట్స్‌కు టేకాఫ్?

Sheik Hasina: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు.

బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

The C-130J transport of the Bangladesh Air Force took off from the Hindon air base

సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకం బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.

ఈ ఉదయం ఈ ఫ్లైట్ వెనక్కి మళ్లింది. కొద్దిసేపటి కిందటే తిరుగుముఖం పట్టింది. ఈ ఉదయం 9 గంటల సమయంలో ఈ ఫ్లైట్ హిండన్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న విషయాన్ని ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఈ ఫ్లైట్ ఎక్కడికి వెళ్లింది? ఇందులో ఎవరు ఉన్నారు? అనేది తెలియరావట్లేదు. ఒకవేళ ఆమె ఇందులో ఉంటే ఈ ఫ్లైట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లొచ్చని సమాచారం.

తన తదుపరి గమ్యానికి ఈ ఫ్లైట్ బయలుదేరి వెళ్లినట్లు వెల్లడించారు. ఈ తదుపరి గమ్యం ఏమిటనేది ఎవ్వరూ నిర్ధారించట్లేదు. ఆ ఫ్లైట్‌లో షేక్ హసీనా ఉన్నారా? లేదా? అనేది ఖరారు కావాల్సి ఉంది. దేశ సరిహద్దులు దాటేంత వరకు ఈ విమానానికి గట్టి భద్రత కల్పించామని అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+