శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఐటీ హబ్ నుంచి మరో విమానం, టైమింగ్స్ ఇవే !
బెంగళూరు/తిరుపతి: బెంగళూరు-తిరుపతి మధ్య విమానంలో సంచరించి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులకు మరో గుడ్ న్యూస్. తిరుమల భక్తులకు మంచి శుభవార్త వచ్చింది. ఐటీ హబ్, గార్డెన్ సిటీ బెంగళూరు-తిరుపతి మధ్య మరో విమానం ప్రారంభం కానుంది. బీదర్-బెంగళూరు విమానాన్ని తిరుపతి వరకు పొడిగించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంగీకరించింది.
కర్ణాటకలోని బీదర్ ఎంపీ, కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా ఈ మేరకు సమాచారం అందించారు. బీదర్ తో పాటు ఆ జిల్లా పొరుగు జిల్లాల ప్రజలు కూడా విమానంలో ప్రయాణించి తిరుపతిని సందర్శించడానికి ఇష్టపడతారు. బీదర్-బెంగళూరు-తిరుపతి మధ్య గురువారం నుంచి వారానికి 5 రోజులు ఈ విమానం ప్రయాణిస్తుందని కేంద్ మంత్రి భగవంత్ ఖూబా అన్నారు.

బీదర్ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత బీదర్ నుంచి ప్రయాణిస్తున్న విమాన విస్తరణ ఇదే తొలిసారి. అలాగే బీదర్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న విమానాన్ని తిరుపతి వరకు పొడిగించాలని బీదర్ వాసులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎంపీ, కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా స్పందించారు. తన నియోజక వర్గ ప్రజల కోసం నిరంతర కృషితో బీదర్-తిరుపతికి విమాన సర్వీసును ప్రారంభించడంలో విజయం సాధించామన్నారు.

ఆగస్టు 24 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని చెప్పిన అధికారులు విమానం షెడ్యూల్‌ను విడుదల చేశాు. సోమ, శుక్రవారాల్లో ఈ విమానం బీదర్‌లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 6.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. రాత్రి 7.10 గంటలకు బెంగళూరులో బయలుదేరి రాత్రి 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతిలో రాత్రి 8. 25 గంటలకు బయలుదేరి 9.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
గురు, శని, ఆదివారాల్లో బీదర్ నుంచి సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరి 6.05 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. బెంగళూరులో 6. 30 గంటలకు బయలుదేరి 7. 20కి తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి 7. 45కి బయలుదేరి 8.35 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని సంబందిత అధికారులు తెలిపారు.
మొత్తం మీద గురువారం నుంచి బెంగళూరు- తిరుపతి మార్గంలో మరో విమాన సర్వీసు అందుబాటులోకి వస్తుండటంతో శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీదర్ విమాన సర్వీసు గురించి మంత్రి భగవంత్ ఖూబా మాట్లాడుతూ.. బీదర్ నుంచి విమాన సర్వీసును ప్రారంభించేందుకు అనేక ఇబ్బందులు పడ్డామని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపామని, సమన్వయంతో సేవలను ప్రారంభించామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీదర్ విమానాశ్రయం నుంచి సివిల్ ఫ్లైట్‌లను నిరంతరంగా నడిపేందుకు చర్యలు తీసుకుంటామని భగవంత్ ఖుబా తెలిపారు.
స్టార్ ఎయిర్‌లైన్స్, ఇండిగోతో చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో బీదర్ నుంచి దేశంలోని వివిధ నగరాలకు విమాన సర్వీసును ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీదర్ విమానాశ్రయం 2020లో ప్రాంరభం అయ్యి మూడేళ్లు ఎయిర్ పోర్టు పనులు పూర్తి చేసుకుంది. బీదర్ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతను జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications