సీఎం మీద పోటీ చేస్తున్న లీడర్ ఎవరంటే ?, క్లైమాక్స్ లో ప్రకటించిన హైకమాండ్ !
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీద ఎవరిని పోటీలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ని రోజులు అనేక మంది నాయకుల పేర్లు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసినా సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద పోటీ చేసే అభ్యర్థి మీద పోటీ చేసే నాయకుడి పేరు ప్రకటించలేదు.
కర్ణాటకలోని శింగ్లావి నియోజక వర్గం నుంచి బసవరాజ్ బోమ్మయ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిని పోటీకి నిలబెట్టి సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని ఓడించాలని మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అనేక ప్రయత్నాలు చేశారు. శింగ్లావి నియోజక వర్గంలో ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న లింగాయత్ నాయకుడి కోసం కాంగ్రెస్ పార్టీ వెతికింది.

అయితే బసవరాజ్ బోమ్మయ్ మీద పోటీ చెయ్యడానికి లింగయాత్ కులంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ చిక్కలేదు. చివరికి మాజీ ఎమ్మెల్యే అజ్జం పీర్ ఖాన్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. అయితే తెర మీదకు మాజీ మంత్రి, ధారవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి పేరు తెర మీదకు వచ్చింది. చివరికి కాంగ్రెస్ పార్టీ వినయ్ కులకర్ణికి ధారవాడ నియోజక వర్గం సీటు ఇచ్చింది.
శింగ్లావిలో లింగాయత్, ముస్లీం, కురబ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇన్ని రోజులు ఏవేవో లెక్కలు వేసిన కాంగ్రెస్ పార్టీ చివరికి మోహమ్మద్ యూసఫ్ ను సీఎం మీద పోటీకి దింపింది. ఇన్ని రోజులు సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద ఎవరెవరినో పోటీకి దింపాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చివరికి మైనార్టీ నాయకుడైన మోహమ్మద్ యూసఫ్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఇన్ని రోజుల దాగుడు మూతల ఆటకు తెరదింపింది.












Click it and Unblock the Notifications