లుంబినీ పార్కు, గోకుల్ చాట్ పేలుళ్ల నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 2007లో పేలుళ్లు జరిగాయి. లుంబినీ పార్కు, గోకుల్ చాట్ వద్ద ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దున్ ఉగ్రవాదులని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు తీవ్రవాదులను అరెస్ట్ చేశారు నిందితులు పేలుళ్లకు పాల్పడ్డారని రుజువు కావడంతో కోర్టు వారికి శిక్ష విధించింది.
నలుగురు ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. జైలు శిక్ష పడిన వారిలో హైదరాబాద్ కు చెందిన ఒబేదుర్ రహ్మన్ తో పాటు ఇమ్రాన్ ఖాన్, ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ అలాం ఉన్నారు. వీరు హైదరాబాద్ లోనే కాకుండా వారణఆసి, ముంబై, ఫైజాబాద్, లక్నో, జైపూర్, ఢిల్లీ, బెంగళూరులో జరిగిన పేలుళ్లులో వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

లుంబినీ పార్కు, గోకుల్ చాట్ వద్ద జరిగిన పేలుళ్లలో దాదాపు 40 ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. అయితే దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకాలాపాలు బయటపడిన హైదరాబాద్ తో సంబంధం ఉంటుంది.
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో కొందరు ఉగ్రవాద సానుభూతి పరులు పోలీసులు పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో 16 మందిని ఆదుపులోకి తీసుకున్నారు.
భోపాల్కు చెందిన 11 మంది, హైదరాబాద్కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా 18 నెలల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications