అక్రమ సంబంధం, భార్య తల నరికి ఊరేగించిన భర్త, సరైన శిక్ష వేసిన కోర్టు

అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్యను అతి కిరాతకంగా హతమార్చిన పాపిష్టి భర్త ఆమె తల నరికి కిరాతకంగా చంపేశాడు. భార్య తల చేతిలో పట్టుకుని ఊరేగింపుగా వీదులు మొత్తం తిరుగుతూ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన భర్త పోలీసుల ముందు లొంగిపోయాడు. భార్యను హత్య చేసిన నిందితుడికి ఇప్పుడు కోర్టు శిక్ష ఖరారు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం భార్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని బండా కోర్టు కీలక తీర్పును వెలువరించింది. 39 ఏళ్ల కిన్నెర్ యాదవ్‌కు మరణశిక్ష పడింది.నేతా పట్టణంలోని బాబెరో కొత్వాలి సెక్టార్‌కు చెందిన కిన్నెర్ యాదవ్ తన భార్య విమలా దేవిని 2020లో అతి దారుణంగా హత్య చేశాడు. తన భార్య విమలా దేవి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని కిన్నర్ యాదవ్ కు తెలిసింది. నాలుగేళ్ల క్రితం భార్య విమలా దేవి ఆమె ప్రియుడితో రొమాన్స్ చేస్తూ ఆమె భర్త కన్నిర్ యాదవ్ కు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది.

The court sentenced the husband who beheaded his adulterous wife to death
దీంతో కిన్నెర యాదవ్‌కు విపరీతంగా కోపం వచ్చింది. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించిన తర్వాత కూడా భార్య విమలా దేవి ఆమె ప్రియుడితో తిరగడం మొదలుపెట్టింది. ఎంత చెప్పినా తనను మోసం చేసిందని రగిలిపోయిన కిన్నర్ యాదవ్ గొడ్డలి తీసుకుని అతని భార్య విమలా దేవి మెడ మీద నరికేశాడు.

కిన్నెర యాదవ్ కోపం చల్లారకపోవడంతో అదే గొడ్డలితో అతని భార్య విమలా దేవి తల, మొండెం రెండుగా నరికేశాడు.విమలా దేవిని రక్షించేందుకు ముందుకు వచ్చిన భార్య బాయ్ ఫ్రెండ్ మీద కూడా దాడి చేశాడు. భార్య విమలా దేవి మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఆమె తల మాత్రం చేతిలో పట్టుకున్న కిన్నర్ యాదవ్ రోడ్డుపై తిరుగుతూ ఊరేగింపుగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు కిన్నెర యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.పోలీసులు సాక్షులందరినీ విచారణ చేసి కోర్టు ముందు సాక్షాలు సమర్పించారు.

The court sentenced the husband who beheaded his adulterous wife to death

ఈ కేసు విచారణకు ఉత్తరప్రదేశ్‌లోని బండా కోర్టు ముందు11 మంది ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. అన్ని రికార్డులు, సాక్షులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కిన్నెర యాదవ్‌ను దోషిగా నిర్ధారించింది. భార్యను హత్య చేసిన తర్వాత, తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతనిని రక్షించడానికి పరుగెత్తినప్పుడు, అతనిపై కూడా దాడి చేశాడు.

ఈ ఘటన తర్వాత విమలా దేవి బాయ్ ఫ్రెండ్ ఊరు విడిచి వెళ్లిపోయాడు. పోలీసులు రెండు సంవత్సరాలు వెతికి చివరకు ఈ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం అతడి నుంచి వాంగ్మూలం కూడా నమోదు చేశారు. భార్యను దారుణంగా హత్య చేసిన కిన్నెర యాదవ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసు విచారణ జరుుతున్న సమయంలోనే బండా కోర్టులో ఐదుగురు న్యాయమూర్తులు మారారు. హత్య జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత నిందితుడు కిన్నర్ యాదవ్ కు ఉరిశిక్షపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+