Karnataka: ఒకే రోజు ముహూర్తం ఫిక్స్ చేసిన ఎన్నికల కమీషన్, రాజీలకు నాలుగు రోజులు !

బెంగళూరు/న్యూఢిల్లీ: ఎన్నికల కమీషన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అన్ని పార్టీల నాయకులకు టెన్షన్ మొదలైయ్యింది. ఎవరు ఏ నియోజక వర్గం నుంచి విజయం సాధిస్తారో చెప్పడం చాలా కష్టం అయ్యింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండటం, అందులో కేవలం 150 మంది నాయకులు వారివారి నియోజక వర్గాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు.

2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అయితే 2023లో కర్ణాటకలో ఒకే రోజు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. మే 10వ తేదీన కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మే 13వ తేదీన 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఫలితాలు వెళ్లడించడానికి ఎన్నికల కమీషన్ ఏర్పాట్లు చేసుకుంటున్నది.

 The Election Commission is finalizing arrangements to conduct polling in 224 assembly constituencies on a single day in Karnataka.

కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండటం, అన్ని నియోజక వర్గాల్లో ఒకే రోజు పోలింగ్ జరగనుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఏప్రిల్ 20వ తేదీ లోపు నామినేషన్లు వెయ్యడానికి నాయకులకు అవకాశం ఉంది, ఏప్రిల్ 24వ తేదీన నామినేన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. నాయకుల మధ్య రాజీలు చేసుకోవడానికి, నచ్చ చెప్పుకోవడానికి ఎన్నికల కమీషన్ నాలుగు రోజులు అవకాశం ఇచ్చింది.

ఇక మే 10వ తేదీన కర్ణాటకలోని 224 నియోజక వర్గాల్లోని ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమీషన్ అవకాశం ఇచ్చింది. మూడు రోజుల పాటు రాజకీయ నాయకుల భవిష్యత్తు స్ట్రాంగ్ రూమ్ ల్లో ఉంటాయి. ఇక మే 13వ తేదీన 224 నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు మొదలై అదే రోజు ఫలితాలు వెళ్లడించడానికి ఎన్నికల కమీషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలో ఒకే రోజు, సింగిల్ ఫేస్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+