హాలీవుడ్, కన్నడ సినిమాలో నటిస్తున్న ముఖ్యమంత్రి: ఆయన పాత్ర ఏమిటంటే ?
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఇప్పటికే బహుబాష నటుడు, దర్శకుడు, నిర్మాత, కమల్ హాసన్ ప్రాణ స్నేహితుడు రమేష్ జీ కన్నడ టీవీలో ప్రాసారం చేస్తున్న వీకెండ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఇప్పటికే బహుబాష నటుడు, దర్శకుడు, నిర్మాత, కమల్ హాసన్ ప్రాణ స్నేహితుడు రమేష్ జీ కన్నడ టీవీలో ప్రాసారం చేస్తున్న వీకెండ్ విత్ రమేష్ షోలో పాల్గోనడానికి సిద్దరామ్య ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి.
ఇయితే ఇప్పుడు కవితా లంకేష్ దర్శకత్వం వహిస్తున్న 'సమ్మర్ హాలిడేస్'చిత్రంలో నటించడానికి సీఎం సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సిద్దరాయ్య కొన్ని షరుతులు పెట్టారు. సినిమాలో హింసాత్మక ఘటనలు, అశ్లీలం లేకుంటునే నటిస్తానని తేల్చి చెప్పారు.

కన్నడ, ఇంగ్లీష్ బాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్దరామయ్య పాత్ర ఏమిటి ? అని అందరూ ఆసక్తిగా ఆరా తీశారు. అయితే ఆయన నిజజీవితంలో ముఖ్యమంత్రి అయ్యారు. సమ్మర్ హాలిడేస్ సినిమాలో కూడా ఆయన సీఎం పాత్రలోనే దర్శనం ఇస్తున్నారు.
విద్యార్థులకు సహాయం చేసే పాత్రలో సిద్దరామయ్య నటిస్తున్నారు. నటించడంలో సిద్దరామయ్యకు ఎంతో అనుభవం ఉంది. కాలేజ్ రోజుల్లో ఆయన ఎన్నో నాటకాలు వేశారు. ఇప్పుడు సిద్దరామయ్య సినిమాల్లో నటించడానికి సిద్దం అయ్యారు.
సమ్మర్ హాలీడేస్ సినిమాలో దర్శకురాలు కవితా లంకేష్ కుమార్తె ఇషా, బాలీవుడ్ నటి దీపా పదుకొనేని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు, నిర్మాత ఇంద్రజిత్ లంకేష్ కుమారుడు సమజిత్ లంకేష్ నటిస్తున్నారు. 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు అభిరుచులు, వారి ఆకాంక్ష, సాహసాలు ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో సమ్మర్ హాలిడేస్ సినిమా తెరకెక్కుతోంది. సిద్దరామయ్య ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు షూటింగ్ మొదలు పెడుతామని దర్శకురాలు కవితా లంకేష్ అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications